calender_icon.png 12 December, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.100కే టీ20 ప్రపంచకప్ టికెట్

12-12-2025 01:20:11 AM

రిలీజ్ చేసిన భారత్, సౌతాఫ్రికా కెప్టెన్లు

ముల్లాన్‌పూర్, డిసెంబర్ 11 : వచ్చే ఏడా ది భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం అభిమానులు ఎం తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ తాజాగా టికెట్ల అమ్మకాలను సైతం ప్రారంభించింది. ఎన్నడూ లేని విధంగా ఈ మెగా టోర్నీ టికెట్ల కనీస ధరను రూ.100గా నిర్ణయించారు. కేవలం ప్రధాన మ్యాచ్‌లే కాకుండా చిన్న జట్ల మ్యాచ్‌లకు కూడా అభిమానులను భారీగా స్టేడియాలకు రప్పించాలన్న.

ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన కేటగిరీల టికెట్ల ధరలు కూ డా తక్కువగానే ఉన్నాయి. భారత్,సౌతాఫ్రికా రెండో టీ ట్వంటీ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు టికెట్లను రిలీజ్ చేశారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఇండియాయూఎస్‌ఏ మ్యాచ్ కు సంబంధించిన టికెట్‌ను విడుదల చేయ గా.. సౌతాఫ్రికాేొకెనడా మ్యాచ్ టికెట్‌ను సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌క్రమ్, మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 7 నుం చి టీ20 ప్రపంచకప్ మొదలవనుండగా.. భారత్, శ్రీలంకలోని 8 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇప్పటికే అందుబాటులో ఉంచిన మ్యాచ్ టికెట్ల అమ్మకాలు మొదలైనట్టు ఐసీసీ తెలిపింది. బుక్ మై షో ద్వారా ఈ మెగాటోర్నీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ కనీస ధర రూ.100  మాత్రమే కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశముందని బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా వ్యాఖ్యానించారు.చిరకాల ప్రత్యర్థులు భారత్,పాకిస్థాన్ టికెట్లను మాత్రం ఇంకా విడుదల చేయలేదు.

ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరుగుతుంది.  పాక్ తన మ్యాచ్‌లను కొలంబో వేదికగా ఆడుతుంది.. కాగా భారత్‌లోని మ్యాచ్‌లన్నీ  అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా , చెన్నై, ముం బై స్టేడియాల్లో జరుగుతాయి.ప్రారంభ మ్యా చ్‌తో పాటు ఫైనల్‌ను అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.