11-09-2025 12:00:00 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
-నేను ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. -డైరెక్టర్ కౌశిక్ కలిసినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడుకున్నాం. అప్పుడు ‘కిష్కింధపురి’ కథ చెప్పారు. చాలా నచ్చింది. -చాలా రోజుల తర్వాత ‘కిష్కింధపురి’తో ఒక స్ర్టైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. నాకు ఇష్టమైన జానర్. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు చాలా మంచి అనుభూతి కలుగుతుందని చేశాం.
-సినిమాను -నిన్న ఫస్ట్ టైమ్ థియేటర్లలో చూశాం. సలార్, యానిమల్, కాంతార సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ డిజైన్ చేసిన సౌండ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఈ సినిమాకు అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.
-దర్శకుడు కౌశిక్ మంచి కథ సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు టెక్నికల్‌గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. -ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. సినిమా ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన చిత్రమిది.
--ఈమధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి.. నటుడిగా నిరూపించుకోవాలనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్‌లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా.
-హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేనెప్పుడూ చూడలేదు. హారర్, మిస్టరీ.. రెండు కలగలిసిన చిత్రమిది. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. -అనుపమ పెర్ఫార్మెన్స్ కొత్తగా ఉంటుంది. నిజానికి అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా టఫ్.
-ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్‌ను సెట్‌గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్‌లో షూట్ చేశాం. అది నిజంగానే పాతబడిపోయిన బిల్డింగ్.
-నా కొత్త సినిమాల్లో ‘టైసన్ నాయుడు’ షూటింగ్ అయిపోయియింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ‘హైందవ’ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ రెండూ విభిన్నమైన సినిమాలు. అలాగే ‘పొలిమేర’ డైరెక్టర్ అనిల్‌తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్.