11-09-2025 12:00:00 AM
మరో టాలీవుడ్ జంట తల్లిదండ్రులయ్యారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులకు తొలి సంతానం కలిగింది. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది.
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి నేరుగా సెట్స్ నుంచి ఆసుపత్రికి చేరుకొని వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. నవజాత శిశువును ఎత్తుకొని ముద్దు చేశారు. తమ మనవన్ని చూసేందుకు నాగబాబు దంపతులు సైతం ఆసుపత్రికి వచ్చారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2017లో ‘మిస్టర్’ సినిమాలో తొలిసారి నటించిన వరుణ్ మధ్య అప్పుడే ప్రేమ చిగురించింది. 2023, నవబంర్ 1న వివాహం చేసుకున్నారు.