15-01-2026 02:19:58 AM
తెలంగాణ కుంభమేళాకు తెరలేచింది. వనదేవతల సన్నిధి మేడారం కొత్తకళ సంతరించుకుంటోంది. జాతరకు 900 ఏండ్ల చరిత్ర ఉంది. కోట్ల మంది భక్తుల ప్రకృతి దైవాలుగా కొలిచే సమ్మక్క- సారాలమ్మ దేవస్థానం ఆధునికీకరణతో పాటు 200 ఏండ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి.1969లోనే మేడారం.. రాష్ర్ట దేవాదాయ, ధర్మాదాయశాఖ ఒడిలోకి చేరింది. ఆ మరుసటి ఏడాది 1970లో తొలిసారి రాష్ర్ట పండుగగా ‘మహా జాతర’ నిర్వహించినప్పటి నుంచి మేడారం సమ్మక్క- సారలమ్మల దేవస్థానం, దాని పరిసరాలు కొత్త సొబగులు సంతరించుకుంటూనే ఉన్నాయి.
రూ.251 కోట్లతో సమ్మక్క సారాలమ్మ దేవస్థానం ఆధునీకరణ ఆదివాసీ దేవతల చరిత్ర ఉట్టిపడేలా శిల్పకళ 31 రాతి శిలలతో ప్రాకార నిర్మాణాలు గొట్టు గోత్రాలకు శాశ్వత రూపం. మహా జాతర నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.80 ఏళ్ల క్రితం దేవతా వృక్షంతో సాధారణ మట్టి గద్దెలతో తల్లుల దేవస్థానం ఉండేది. గతంలో తాత్కాలికంగా క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, రోడ్లు ఏర్పాటు చేసి 4 రోజుల జాతర జరిపేవారు. కానీ, తాత్కాలిక ఏర్పాట్లతో రూ.కోట్లు వృథా అవుతున్నాయని భావించిన రేవంత్ ప్రభుత్వం శాశ్వత మరమ్మతుల కోసం పునరుద్దరణ చేపట్టింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర నిర్వహణకు రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. వందల వసంతాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గిరిజనుల ఇష్టదైవాల నిలయం మేడారం దేవస్థాన పరిధిలో శాశ్వత ప్రాతిపదికన కొత్త నిర్మాణాలు చేపట్టింది. సెలవులు కావడం తండోపతండాలుగా అప్పుడే మేడారం జనంతో నిండుతున్నది.శివసత్తుల పూనకాలతో దద్దరిల్లుతుంది
కుంభమేళాగా రూపాంతరం..
మేడారం ప్రాధాన్యత సంతరించుకోవడానికి అనేక కథనాలు వెలువడ్డాయి. క్రీ 1083 నుంచి 1323 వరకు ఓుంగల్లు కేంద్రంగా కాకతీయులు పాలించిన సమయంలో పగిడిద్దరాజు పాలించేవారు. కన్నారం పాలించిన మేడరాజుకు మేనల్లుడని చరిత్ర చెప్పుతుంది. నాడు కోయదొరలు వేటకోసం వెళ్ళినప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఓ పసి పాప కోయదొరల కంటపడింది. పాపను తమ వెంట తెచ్చుకొని మార్గశిర పౌర్ణమి నాడు సమ్మక్కగా నామకరణం చేశారు. ఆదివాసీలు తెచ్చుకొని పెంచిన పాప పెరిగిన కొద్దీ ఆ గూడెంలో సకల సంపద, ఊరు నిండా శుభ, ఐశ్వర్యాలతో విరాజిల్లింది. మునుపెన్నడూ లేనివిధంగా ఇంతటి శుభ గడియలు రావడానికి పాపను దేవతగా పూజించారు. యుక్త వయస్సు రాగానే మేడారం ప్రాంతాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజుతో వివాహం చేశారు. ఆ పుణ్యదంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. కాకతీయ కాలంలో ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో శిస్తులు కట్టమని వేదించేవారు, పగిడిద్దరాజు కట్టలేక నిరాశ్రయుడైన క్రమంలో కోపోద్రిక్తుడైన ప్రతాపరుద్రుని నేతృత్వంలో ఏకంగా యుద్ధం ప్రకటించారు.
తన కుమార్తె నాగులమ్మ, కుమారుడు జంపన్న వీరోచిత పోరాటం చేసి సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పొందారు. మరణవార్త విని సమ్మక్క -సారలమ్మలు కదనరంగంలోకి దూకి కాకతీయుల సైన్యాన్ని మట్టుబెట్టారు. ఓటమి ఖాయం అని భావించిన సైనికుడు దొంగచాటున సమ్మక్కను వెనుక నుంచి బల్లెంతో పొడువగా, ఆమె యుద్ధభూమి నుంచి అదృశ్యమయ్యి చిలుకలగుట్టవైపు వెళ్ళిందని, ఇదే యుద్ధంలో సారాలమ్మ కూడా వీరమరణం పొందిందని చరిత్ర చెప్పుతున్నది. 1955 వరకు వందల సంఖ్యలో రెండేండ్లకొకసారి మేడారాన్ని దర్శించేవారు. ఇప్పుడు కోట్ల సంఖ్యల్లో పాల్గొని ఆదివాసులే కాకుండా సమ్మక్క- సారాలమ్మను వీరవనితలుగా అందరు కొలుస్తూ పూజించే పండుగే మహాకుంభమేళా మేడారం.
అడవివైపు బాటలు..
సమ్మక్క సారలమ్మ జాతరలో కీలకఘట్టం మొదలయ్యే తరుణం రానే వచ్చింది. సెలవులు వచ్చిన దరిమిలా అడవి నిండా కార్లు, బస్సులు, వ్యాన్లు,ఆటోలు, ఎడ్లబండ్లు, మేడారం బాట పడుతున్నాయి. కొన్నిరోజుల్లో మొదలయ్యే మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 19న సమ్మక్క- సారాలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులు సమ్మక్క, సారాలమ్మలు ఇష్టపడే అడవిలో జంపన్న వాగులో స్నానం చేసి తర్వాతనే దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ.
ఈ వేడుకలో వెదురు కర్ర, కుంకుమ భరణినే ఉత్సాహమూర్తులుగా కొలుస్తారు. తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం రావడానికి సన్నద్ధమయ్యారు. తెలంగాణ కుంభమేళాకు కోటిన్నర భక్తులు వస్తారని అంచనా, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు వచ్చే భక్తులకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా విఐపీల కోసం హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్‌లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
‘మరో 200 ఏళ్లు నిలిచేలా మేడారంలో గిరిజన సంసృ్కతి-సంప్రదాయాలకు అనుగుణంగా భారీ వ్యయంతో రాతి కట్టడాలను నిర్మించారు. జనజాతర కు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మేడారం చుట్టపక్కల 10 కిమీ.మేర నాలుగు లైన్‌ల రోడ్లు నిర్మాణం చేపట్టారు. మహిళలకు ‘ఫ్రీ బస్’ కారణంగా మహిళలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముందంటే అతిశయోక్తి కాదు.
ఆత్మ గౌరవానికి ప్రతీక..
రామప్ప చూస్తే కాకతీయుల చరిత్ర స్ఫురణకు వచ్చినట్లే.. మేడారాన్ని చూస్తే గిరిజనుల దేవతల చరిత్ర జ్ఞప్తికి వచ్చేలా నిర్మా ణాలు సాగాయి. దేవస్థానం ఆధునికీకరణ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల పునరుద్ధరణ, ఆదివాసీ దేవతల చరిత్ర ఉట్టి ప డేలా శిల్పకళ, సాండ్ స్టోన్ పలకలపై 7వేల గిరిజన సంప్రదాయాల బొమ్మలు, ఆర్చిగేట్లపై సమ్మక్క- సారాలమ్మలతోపాటు పగి డిద్ద రాజు, గోవిందరాజు వంశాల చెట్లు, జం తువులు, గొట్టు గోత్రాల చిత్రాలు, వెదురుబొంగులను పోలిన 31 రాతిశిలలతో ప్రాకా ర నిర్మాణాలు చేపట్టడం ఒక అనుభూతిని కల్గిస్తుంది.
భావి తరాలకు తెలిసేలా ఆదివాసీలు, గిరిజనుల జీవన విధానం,ఆ రాతి శిల లపై సమ్మక్క-సారలమ్మలకు పూజారులు నిర్వహించే పూజలు, గొట్టు గోత్రాలు, వారి సంప్రదాయాల సంబంధిత బొమ్మలను చె క్కారు. ఈ నేపథ్యంలో మేడారం పరిసరా ల్లో వేల సంఖ్యలో వందల రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు విగ్రహాలు కాని, గోపురాలు కాని, పూజలో వేదమంత్రాలు, ధూప, దీప నైవేద్యాలు, అర్చనలు చేసే అడ్డబొట్టు, పొడుగుబొట్టు అయ్యవార్లు కనిపించారు.
పూజలో వన మూలికలు, బెల్లం పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బి య్యం శ్రేష్ఠంగా భావిస్తారు. కుంభ మేళాను తలపించేలా మేడారం జాతరకు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి పరిశీలిస్తుండగా, ఆదివాసిబిడ్డ, రాష్ర్ట మంత్రి రణధీర సీతక్క దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నది. ఈ నెల 18వ తేదీన మేడారం వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడే మకాం వేసి, మిగిలిన ప నుల పర్యవేక్షణ, మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. గిరిజనుల ఆరా ధ్య దైవం, వన దేవతలైన సమ్మక్క -సారల మ్మ ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడంమే అనే భావం అందరిలో నెలకొంది. ఆదిమ జాతుల ఆత్మగౌరవ పండుగగా గు ర్తించి తెలంగాణ ప్రభుత్వం వనదేవతల దర్శ నం కోసం ఒకరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9866255355
డాక్టర్ సంగని మల్లేశ్వర్