15-01-2026 02:16:54 AM
ఇరాన్ నిరసనలకు కారణం ఆర్థిక పతనమే. ఇరానియన్ రియాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ద్రవ్యోల్బణం సుమారు 40 శాతానికి చేరింది. ఆహారం, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి.
ఇరాన్ తన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక కష్టాలపై ప్రారంభమైన నిరస నలు దేశవ్యాప్తంగా విస్తరించి, ఇవాళ సు ప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పదవి దిగిపోవాలంటూ చేస్తున్న నిరసనలు సవాలుగా మారాయి. హింస పెరుగుతున్న వేళ, ఉరిశిక్షల బెదిరింపులు, ఇంటర్నెట్ నిలిపివేత సహా అమెరికా వంటి విదేశీ శక్తుల జో క్యం-ఇరాన్ అంతర్గత కలహాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. మానవ హక్కుల సం స్థలు పరిస్థితి వేగంగా క్షీణిస్తున్నదని హెచ్చరిస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి అగ్నెస్ కాలమార్డ్, నిరసనలను అణిచివేయడానికి ‘త్వరితగత విచారణలు, యాదృచ్ఛిక ఉరిశిక్షలు’ మళ్లీ ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
2022లో జరిగిన ఉమెన్, లైఫ్, ఫ్రీడం ఉద్య మం తర్వాత చోటుచేసుకున్న సామూహిక ఉరి శిక్షలను ఆమె గుర్తు చేశారు. 26 ఏళ్ల నిరసనకారుడు ఎర్ఫాన్ సొల్తానీ కేసును ఉదాహరణగా పేర్కొంటూ, అతడికి తక్షణమే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంద ని తెలిపారు. దాదాపు సంపూర్ణ ఇంటర్నెట్ నిషేధం కారణంగా హత్యలు, అరెస్టుల నిజమైన పరిమాణాన్ని నిర్ధారించడం అసాధ్యం గా మారింది. అశాంతి వ్యాప్తి మాత్రం స్ప ష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌లోని 31 ప్రావిన్సులన్నింటిలోనూ నిరసనలు చెలరేగాయి. 180కు పైగా నగరాల్లో వందలాది ప్రదర్శన లు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2500 దాటిందని, వేల మందికి పైగా అరెస్టయ్యారని హక్కుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ కట్ కావడం వల్ల కుటుంబాలు సంబంధాలు కోల్పోయాయి, సమాచారం శూన్యావస్థ నెలకొంది-. ఇదంతా జరుగుతుండగానే భద్రతా బలగాలు తమ దమన చర్యలను మరింత కఠినతరం చేశాయి.
జోక్యం అనవసరం..
తాజా నిరసనలకు కారణం ఆర్థిక పతనమే. ఇరానియన్ రియాల్ చరిత్రలో ఎన్న డూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ద్రవ్యోల్బణం సుమారు 40 శాతానికి చేరిం ది. ఆహారం, ఇంధన ధరలు ఆకాశాన్నంటా యి. పెట్రోల్ ధరల పెంపు, చాలా వస్తువులపై సబ్సిడీ మారకపు రేట్ల రద్దు ఇవన్నీ అనేక కుటుంబాలను పాతాళానికి నెట్టేశా యి. అయితే నిరసనలు త్వరలోనే ఆర్థిక అం శాలను దాటి, రాజకీయ దమనంపై ఉన్న లోతైన కోపాన్ని ప్రతిబింబించాయి. ము ఖ్యంగా 2022లో పోలీస్ కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఘటన ఇరాన్‌ను కద లించి వేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అ ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘర్షణాత్మక ధోరణిని అవలంబించారు. నిరసనలు కొనసా గించాలని ఇరానీయులను ప్రోత్సహిస్తూ, నిరసనకారులకు ఉరిశిక్షలు అమలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని టెహ్రాన్‌ను హె చ్చరించారు. ఇరాన్‌లో ‘గెలవాలి’ అనేదే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు.
అందుకు వేగవంతమైన, బలప్రయోగాత్మక చర్యలకు సంకే తాలు ఇచ్చారు. అయితే మధ్యప్రాచ్యం పై అమెరికా దృష్టిని తగ్గించాలని, ఇతర దే శాలపై రాజకీయ మార్పులు రుద్దకూడదని చెప్పిన కొద్ది వారాల క్రితమే విడుదలైన వా షింగ్టన్ జాతీయ భద్రతా వ్యూహానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అమెరికాలోనే ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. సెనేటర్ బెర్నీ శాండర్స్, అమెరికా సైనిక జోక్యం ఘోరమైన తప్పిదమని హెచ్చరిస్తూ, గత జోక్యాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. హింసాత్మక దమనాన్ని ఆపాలని, ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలను మద్దతు ఇవ్వాలనేది ఆయన అభిప్రాయం.
1979ని గుర్తు చేస్తుందా?
బాహ్య ఒత్తిడి-ముఖ్యంగా సైనిక బెదిరింపులు తాము సహాయపడాలనుకునే ప్ర జలకే నష్టం చేస్తాయన్న విస్తృత ఆందోళనను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఇరా న్‌లో నెలకొన్న సంక్షోభం మరో 1979 ఆం దోళనలను గుర్తు చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇరాన్ గమ్యం కూడా ఆ దిశగానే వెళ్తుందా అనే ప్రశ్న చాలా మందిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. కానీ ఈ పోలిక మోసపూరితమైనది. షాను కూల్చిన విప్లవం విజయం సాధించడానికి నిరసనలే కాకుండా, అధికార వర్గాల్లో చీలికలు, భద్రతా బలగాల సందిగ్ధత కూడా కారణమయ్యాయి. నేటి ఇరాన్ పూర్తిగా భిన్నం. ఇక్కడ అధికారము కట్టుదిట్టమైన ధార్మిక భద్రతా రాజ్యంలో కేంద్రీకృతమై ఉంది.
రెవల్యూషనరీ గార్డులు, బసీజ్, గూఢచార సంస్థలు గాఢంగా ముడిపడిన సిద్ధాంతపరమైన విధేయతతో పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు మాత్రమే ఉన్నత వర్గాల విరుగుడుకు దారి తీసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్‌లో జరుగుతున్న చర్యలను చూస్తుంటే మాత్రం ఇది కఠినమైన దమనానికే దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఇరాన్ పట్ల బాహ్య జో క్యం ఈ సమీకరణాన్ని తప్పనిసరిగా మార్చ దు. నాయకత్వ వ్యవస్థను అస్థిరం చేయగలిగినా, అమెరికా లేదా ఇజ్రాయెల్ బహిరంగంగా జోక్యం చేసుకోవడం ద్వారా ఇరాన్‌లోని ప్రజల్లో కొంతమంది వ్యతిరేక శక్తులను కఠిన వాదులుగా మార్చేస్తుంది. దీనివల్ల దేశంలో జరుగుతున్న నిరసనలు విదేశీ ప్రేరేపితమన్న ప్రభుత్వ వాదనకు బలం చేకూరినట్లయింది.
భవిష్యత్తు కోసం పోరాటం..
ఇలాంటి ఒత్తిడి రాజకీయ స్థలాన్ని తెరవడం కన్నా మూసివేయడానికే ప్రాధాన్యమి వ్వాలని చరిత్ర పేర్కొంటుంది. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో పణాలు చాలా ఎత్తులో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మిత్ర బలగాలు ఒత్తిడిలో ఉన్నాయి. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయంగా తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. ఆయుధ స్థాయి సమీపానికి యురేనియం శుద్ధిని పెంచిన టెహ్రాన్, ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థతో సహకారాన్ని తగ్గించింది.
తాము అణు బాంబును కోరుకో వడం లేదని చెబుతూనే క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తూ ఇరాన్ నాయకత్వం తమ వైఖరిని స్పష్టంగా పేర్కొంటుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ వెనక్కి తగ్గదని ఖమేనీ ప్రకటిస్తూ, నిరసనకారులను విదేశీ శక్తుల ఏజెంట్లుగా దూషించారు, బయటి దేశాలు జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. నిరసనలు కొన సాగుతున్న కొద్దీ ముందున్న మార్గం మ రింత సంకుచితమవుతోంది. అంతర్జాతీయ సమాజానికి సవాలుగా మారుతోంది. వీధు ల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న ఇరానీయుల గౌరవం, న్యాయం, భవిష్యత్తు కోసం సాగుతున్న పోరాటంగా ఉంది.
ముచ్చుకోట సురేష్‌బాబు