calender_icon.png 26 September, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి

26-09-2025 12:40:02 AM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

కల్వకుర్తి సెప్టెంబర్ 25: రాష్ట్ర మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు.  గురువారం కొండారెడ్డిపల్లి గ్రా మంలో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి స్వగ్రామమైన వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 91.71 కోట్ల అంచనా వ్య యంతో 18 రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఈ నెల 29న రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు.జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్, అభివృద్ధి పనుల ప్రత్యేక అధికారి దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

మంత్రుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రోటోకాల్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల పురోగతి వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పాల శీతలీకరణ కేంద్రం, బ్యాంక్ , చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల, ఆర్‌ఎంబి రోడ్డు వంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఉంటాయని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆయ శాఖల అధికారులు గ్రామస్తులుపాల్గొన్నారు.