26-09-2025 12:39:13 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తమిళనాడు తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టిందని, విద్యను విప్లవంగా భావిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశానికి రోడ్ మ్యాప్ ఇవ్వనున్నాయని, నాలెడ్జ్ హబ్ కానున్నాయని తెలిపారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ‘విద్యలో ముందంజలో తమిళనాడు’ అనే కార్య క్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు.
అనేక మంది క్రీడాకారులను తయారు చేసేందుకు తాము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామని చెప్పారు. తమిళనాడు- -తెలంగాణ మధ్య సాంస్కృతిక, స్నేహ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నాని చెప్పారు. తమిళ విద్యార్థులు, కోచ్‌ల కు స్పోర్ట్స్ యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సా ధించే బాధ్యత తెలంగాణ, -తమిళనాడు తీసుకుంటాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో అది సాధ్యం కా దు అన్నారు.
తెలంగాణలో వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట చదువుకునేలా భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. టాటా కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
తమిళనాడు గొప్ప యోధుల జన్మస్థలం
“అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ నాడా ర్ వంటి యోధుల జన్మస్థలం తమిళనాడు” అని సీఎం రేవంత్ అన్నారు. కరుణాని ధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్‌ను అభినందిస్తు న్నాని చెప్పారు. తమిళనా డు అవలంబిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం తెలంగాణలోనూ వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామన్నారు.‘సామాజిక న్యాయం అమలులో తమిళనాడు, -తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయి. మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మా రాష్ర్టంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం” అన్నారు.