27-12-2025 01:19:06 AM
హైదరాబాద్, డిసెంబర్ 26: క్రీడల ద్వారా దేశనిర్మాణంలో కీలకపాత్ర పోషించే లక్ష్యంతో నడుస్తోన్న ప్రముఖ ఎన్జీవో సంస్థ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో అమ్మాయిల కోసం డా.దిప్తి సుర్‌మెమోరియల్ మల్టీ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ ఘనంగా నిర్వహించారు. రెం డురోజుల పాటు సాగిన ఈ పోటీల్లో దాదాపు 550 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ట్రాక్ అండ్ ఫీల్డ్, కబడ్డీ, ఖోఖో వంటి వాటిలో పోటీలు జరిగాయి.
ఆర్మీ పబ్లిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ నంబర్ 1, గోల్కొండ, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధిపత్యం కనబరిచాయి. ముగింపు వేడుకలకు యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ ఆఫీసర్ ఎమీలియా స్మిత్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడల్లో చిన్నారులను ప్రోత్సహిస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మాజీ రంజీ క్రికెటర్ సాయిబాబాను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.