22-01-2026 12:52:17 AM
రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒక్కో స్థానం నుంచి పదుల సంఖ్యలో టికెట్ కోసం పోటీ
అధికార పార్టీలోకి భారీగా వలసలు
తలనొప్పిగా మారిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
నాగర్ కర్నూల్ జనవరి 21 ( విజయక్రాంతి )మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం క్రమంగా రంగులు మారుతుంది. జెండా, ఎజెండా, కండువాలు, సి ద్ధాంతాలు పక్కనపెట్టి ప్రస్తుతం గెలుపే ల క్ష్యంగా ఆశావాహులు అడుగులు వేస్తున్నా రు. ఏనాడూ ప్రజా సమస్యలు పట్టని కొత్త మోకాలు సైతం తెరపైకి వచ్చి ఓన్లీ ఒక్క ఛా న్స్ అంటూ మున్సిపల్ ఎన్నికల భరిలో నిలిచేందుకు పదుల సంఖ్యలో అభ్యర్థులు ముం దుకొస్తున్నారు.
అధికార పార్టీ అయితే సులువుగా తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న కుతూ హలంతో గతంలో పట్టుకున్న జెండాలు, వేసుకున్న చొక్కాలు వాటి రంగులు గుర్తులను పక్కనపడేసి ఊసరవెల్లిలా రంగులు మార్చి కొత్త వాటి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో కుల ప్రాతిపదికన యువజన సంఘాలు, మహి ళా సంఘాలు వంటి సహకారం తీసుకుంటూనే బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధికార కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ స్థానిక నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.
గతంలో ఓటర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక ప్రజా బలం కోల్పోయి ఓటమి భయం పట్టుకున్న కొంతమంది మాజీలు అధికారం కోసం ఆ రాటపడుతూ కనిపిస్తున్నారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అత్యధికం గా అధికార పార్టీలోకి ఆశావాహులు జంప్ అవుతున్నారు. వీరంతా గతంలోని బిఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వా రే అయినా స్థానిక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పూర్తిగా విఫలమైన ప్రజాబలం కోల్పోయిన వారే ఉన్నారని ప్ర చారం.
కానీ చెరువులు, కుంటలు, నాళాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ కోట్లకు పడగలెత్తిన వారే ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక, ఎర్రమట్టి, నల్లమట్టి దం దాలు, భూ సెటిల్మెంట్లు గత పదేళ్లలో బాగా వంట బట్టాయి. ఎంతో మంది అమాయకులను, అక్రమాలు అవినీతిపై ప్రశ్నించిన వారి ని సైతం తప్పుడు కేసులు బనాయిస్తూ జైలు పాలు కూడా చేసిన సందర్భాలున్నాయి.
ఫలితంగానే బిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిందనేది జగమెరిగిన సత్యం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత మూడేళ్లుగా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, భూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్న వారిని పార్టీలోకి ఆహ్వానించి తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో క్రమంగా సామాన్యుల నుండి వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే గత నెల క్రితం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వారికి ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఫలితంగానే మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు ఆయా పార్టీ లు బలంగా నమ్ముతున్నాయి.
ఇక బిజెపి పార్టీ మాత్రం కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొంతమేర అభ్యర్థుల ఎం పికపై దృష్టి సారించగా నాగర్ కర్నూల్ ము న్సిపాలిటీలో మాత్రం కనుచూపుమేర కమ లం ఎక్కడా కనిపించకపోవడంతో ఆ పార్టీపై నమ్ముకున్న ఆశావాహులు ఎటూ తేల్చుకోలేక తల మునకలవుతున్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా నైనా పోటీలో దిగుదామని కొందరు రంగం సిద్ధం చేసుకుంటు న్నారు.
ఆ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేవలం పేరుకే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి మాత్రమే మిగిలిపోయారని ఆ పార్టీ ఆ శావాహులు బాహాటంగా విమర్శిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అధికార పా ర్టీలోకి వరుస కడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు అభ్యర్థు ల ఎంపిక విషయంలో తలనొప్పిగా మారిం ది. ఇతర పార్టీ నుంచి వస్తున్న మాజీ కౌన్సిలర్లు, ప్రజా బలం కోల్పోయిన నేతలను న మ్మి బోల్తా పడతారా... కొత్తవారిని తెర మీద కితెస్తూ తెలివిగా ఆలోచిస్తారా వేచి చూడాలి.