calender_icon.png 24 December, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా జాతర ప్రచారం షురూ

24-12-2025 01:57:12 AM

  1. ఆయా గ్రామాలకు బయలుదేరిన రథం
  2. కేస్లాపూర్‌లోని మురారి ఆలయంలో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు 

ఉట్నూర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రచారానికి ప్రచార రథం బయలుదేరింది. మంగళవారం ముందుగా కేస్లాపూర్ లోని మురారి ఆలయంలో మెస్రం వంశీయు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో మెస్రం వంశస్థులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జాతరకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

నాగోబా అభిషేకానికి అవసరమయ్యే గంగా జలానికి ఈ నెల 30న మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు, జనవరి 18న నాగోబా మహా పూజ నిర్వహించుటకై తీర్మానించారు. అదేవిధంగా సిరికొండ మం డలలోని గుగ్గిళ్లస్వామి అనే కుమ్మరికి నాగో బా పూజలకు అవసరమయ్యే మట్టి కుండల తయారీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించా రు. జాతర ప్రచార రథం నిర్వహించే గ్రామా ల్లో భాగంగా ఈ నెల 24న రాజంపేటలో ప్రచారం నిర్వహించి, 25న గుడిహత్నూర్ మండలంలోని సోయం గూడలో ప్రచారం నిర్వహించి, అక్కడే  బస చేస్తారు.

26న ఇంద్రవెల్లి మండలం లోని గిన్నెరా, ఉట్నూర్ మండలంలోని సాలెవాడలో, 27న ఇంద్రవెల్లి మండలం పొల్లుగూడలో, 28న వడగంలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 29న కేస్లాపూర్‌లోని మడవి వారి ఇంటికి చేరుకొని బస చేయాలని తీర్మానించారు. ప్రచార రథంలో నాగో బా దేవుడి ప్రతిమతో పూజారి మెస్రం హనుమంత రావు, ప్రధాన్ దాదేరావులు బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మెస్రం పెద్దలు చిన్ను పటేల్, కోసే రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు.