28-07-2025 12:00:00 AM
అయిజ జూలై 27: ఐజ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో నారాయణ తాయిక్వాండో అకాడమీ శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది తాయిక్వాండో విద్యార్థులకు బెల్ట్ ఎగ్జామ్స్ నిర్వ హించి ప్రమోషన్ పొందిన విద్యార్థులకు బె ల్టులు మరియు సర్టిఫికెట్లు ప్రదానం చేసా రు.
ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా హా జరు అయిన ఐజ పట్టణ ఎస్ ఐ శ్రీనివాస్ రావు, పట్టణ సీనియర్ మాస్టర్స్ మధుకుమార్,రమేష్ లు మాట్లాడుతూ తాయిక్వాం డో క్రీడ విద్యార్థుల మానసిక, శారీరక ధ్రుడత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుం దని, ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడుతుందని వారు తెలిపారు.