calender_icon.png 28 July, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్ద కాలం తర్వాత నిజమైన తెలంగాణ పోరాట యోధులకు గుర్తింపు

28-07-2025 01:39:04 AM

  1. విప్ బీర్ల ఐలయ్య

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు ప్రొఫెసర్ జయశంకర్  స్మారక పురస్కారం అందజేత

హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 27 (విజయక్రాంతి): దశాబ్ద కాలం తర్వాత నిజమైన తెలంగాణ పోరాట యోధులకు గుర్తింపు లభించడం అభినందనీయమని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నా రు. ఆదివారం తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షు లు నారగౌని పురుషోత్తం నేతృత్వంలో  రవీంద్రభారతిలో తెలంగాణ సన్మా న్ 2025 పుర స్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమానికి బీర్ల ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ స్మారక పురస్కారాన్ని బీర్ల ఐలయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రెటరీ శ్యాం ప్రసాద్ లాల్ సభకు అధ్యక్షత వహించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మికి వీరనారి చిట్యాల ఐలమ్మ స్మారక పురస్కారాన్ని అందజేశారు. వీరితో పాటు సీనియర్ సినీ విమర్శకులు పొన్నం రవిచంద్రకు పైడి జయరాజ్ స్మారక పురస్కారం, ప్రముఖ గాయకులు దరువు అంజన్నకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మారక పురస్కారం, సీనియర్ పాత్రికేయులు కాసుల ప్రతాపరెడ్డికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు  కాలేరు సురేష్,  ప్రవీణ్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేత మెరుగు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు