28-07-2025 12:00:00 AM
అరకొరగా ఏర్పాటు చేసిన... ప్రజాధనం దుర్వినియోగం
ప్రజల ఇబ్బందులు పట్టని పాలకులు, ఇరుకు రోడ్లపై కూరగాయలు క్రయవిక్రయాలు
అలంకరణ ప్రాయంగా కూరగాయల మార్కెట్.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
నిర్మించిన మార్కెట్ వినియోగంలోకి తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని బహటంగా చర్చ
వనపర్తి, జూలై 27 ( విజయక్రాంతి ) : దశాబ్ద కాలంగా జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల మండల ప్రజలు కూడా నిత్యం వివిధ అవసరాల నిమిత్తం కోసం వనపర్తి జి ల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడంతో పాటుగా ఆదివారం వస్తే చాలు సంత ( కూ రగాయల మార్కెట్) వచ్చేవారి సంఖ్య మ రింత పెరుగుతుంది. వనపర్తి గ్రేడ్ (3) మునిసిపాలిటీ గా 1984లో ఆవిర్భవించింది.
పట్ట ణ ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ లేకపోవ డం గమనార్హం. నాలుగు దశాబ్దాలుగా వనపర్తి ప్రజల కు శాశ్వతమైన కూరగాయల మార్కెట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి.
ప్రణాళికలోపమా...! నిర్వహణ లోపమా....!!
జిల్లాల పునర్విభజన అనంతరం అప్పుడున్న జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ప్రజల పడుతున్న ఇబ్బందులను గమనించి జిల్లా కేంద్రం లోని గాంధీచౌక్ సమీపంలో గల కందకం స్థలం నిరుపయోగంగా ఉండడం ఎందుకని ప్రజలకు అవసరాలకు ఉపయోగపడేలా అట్టి స్థలాన్ని కూరగాయల మా ర్కెట్ కు కేటాయించడం తో పాటు రూ మూడు కోట్ల పైచిలుకు అంచనాతో ఆధునిక పద్ధతిలో కూరగాయల మార్కెట్ ను ని ర్మించాలని టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పను లు చేపట్టారు. అయితే 50 శాతం పనులు పూర్తి చేసుకుని కూరగాయల మార్కెట్ ని ర్మాణం పూర్తయింది.
కరోనా విపత్తు కాలంలో కూరగాయల మార్కెట్ లో కూరగాయలు క్రయ విక్రయాలు సైతం అక్కడే జ రిగాయి. అయినా అప్పటికి ఆశించినంతగా జరగకపోగా 2021లో అప్పుడున్న ఐటీ , మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్మించిన కూరగాయల మార్కెట్ తో పాటు బ్యా లెన్స్ పనిచేయాలని శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ అధికారులు కూరగాయల మార్కెట్ పై దృష్టి పెట్టకపోవడంతో కొన్ని నెలల క్రితం బాలుర ప్రభుత్వ జూనియర్ క ళాశాల ప్రాంగణంలో కూరగాయలను వ్యా పారులు, వీధి విక్రయదారులు క్రయ విక్రయాలు చేశారు.
అట్టి ప్రాంతంలో వీధి విక్రయదారులు క్రయవిక్రయాలు చేస్తే ము న్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది .ప్రధానంగా కూరగాయల మా ర్కెట్ , చేపల మార్కెట్ 2001లో శంకర్ గం జి ప్రాంతంలో అప్పటి మాజీ రాజ్యసభ స భ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి నిధులతో కూరగాయల మార్కెట్ నిర్మించారు.
మున్సిపాలిటీ అధికారులు సరైన నిర్వహణ లేకపోవడంతో లక్షలు వెచ్చించి కట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. ప్రణాళిక లోప మా...? నిర్వహణలోపమా...? అని పలువు రు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలకు అవసరమయ్యే ఏ పని అయినా దూర దృష్టితో ప్రణాళిక తయారుచేసి చేపడితే బాగుంటుంది కానీ ప్రజాధనాన్ని బూడి దలు పోసే పన్నీర్ల అవద్దని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోట్లు వెచ్చించారు... వినియోగం మర్చారు....?
గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం లో... ప్రజలకు అవసరమయ్యే.. మౌలిక సదుపాయాల కోసం కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు కానీ ఇప్పటివరకు నిర్మిం చిన భవనాలు నిరుపయోగంగా ఉండడం ఏంటో అధికారులకే తెలియాలి అని పలువురు రాజకీయ నాయకులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు.
రూ మూడు కోట్ల పైచిలుకు అంచనాతో ఆధునిక హంగులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ఎందుకు నిరుపయోగంగా ఉందో పుర ప్రజలకు అంతుచిక్కడం లేదు. అలాగే రూ 19 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినప్పటికి కూరగాయల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వే సైడ్ మార్కెట్ లను మాజీ మంత్రి తారక రామారావు ప్రారంభించారు. నిర్మించిన భవనాలు నేటికీ అలంకర ప్రాయంగా కనిపిస్తుండడం అధికారులు దృష్టి సారించడం లేదన్న చెప్పాలి.