04-07-2025 01:30:25 AM
కొణిజెట్టి రోషయ్య మెమోరియల్ ఫోరమ్
ఖైరతాబాద్; జూలై 3 (విజయక్రాంతి) : మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్య స్మారకార్థం అమీర్ పేట లోని ప్రకృతి వైద్యశాలకు ఆయన పేరు పెట్టాలని డాక్టర్ కొణిజెట్టి రోశయ్య మెమోరియల్ ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు గురువారం రోషయ్య నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మెమోరియల్ ఫోరమ్ సభ్యులు కామిశెట్టి అనిల్ కుమార్, ఫెడరేషన్ అఫ్ అవొపాస్ జాతీయ అధ్యక్షులు, సిఏ బెల్ది, శ్రీధర్‌లు మాట్లాడుతూ గడిచిన రోషయ్య వర్ధంతి సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జులై 4న రోషయ్య జయంతిని ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు.
అతి తక్కువ సమయంలో కొణిజెట్టి రోష య్య విగ్రహ ఏర్పాటు చేయడంపై యావత్ వైశ్య జాతి ఆనందం వ్యక్తం చేస్తుందని తెలిపారు. రేపు జరగ బోయే రోషయ్య విగ్రహ ఆవిష్కరణ, జయంతి సభ కార్యక్రమాలకు రెండు తెలు గు రాష్టాల వైశ్యలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.