calender_icon.png 4 July, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైదీలకూ హక్కులు ఉంటాయి

04-07-2025 01:30:42 AM

నిర్మల్, జూలై 3(విజయక్రాంతి): ప్రతి పౌరుడు మాదిరిగానే జైల్లో ఉన్న ఖైదీలలో కూడా రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించబడిందని వాటిని సద్వినించుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. గురువారం  పట్టణంలోని జైలు సందర్శించి ఖైదీలకు న్యాయవిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఆర్థిక స్తోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. 

అనంతరం వంటకాలను పరిశీలించారు. ఖైదీలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ ఫీ చైర్మన్ రాధిక సిబ్బంది పాల్గొన్నారు.