calender_icon.png 15 October, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌సీఎపీహెచ్ చట్టాన్ని అమలు చేయాలి

15-10-2025 01:21:28 AM

  1. గుర్తింపు లేని కళాశాలలను మూసివేయాలి
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్14 (విజయక్రాంతి): ఎన్‌సిఎపీహెచ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసి, గుర్తింపు లేని కళాశాలలను తక్షణమే మూసివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవాన్ని పుర స్కరించుకొని అలైడ్ హెల్త్కేర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అలైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ కోసం ప్రభుత్వ ఉద్యో గ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.

ప్రైవేట్ రంగంలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతా చట్టాలు తీసుకురావాలని కోరారు. ఉద్యోగులకు రూ. 30 వేలు బేసిక్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారామెడికల్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ‘ది అనాటమీ ఆఫ్ అవేర్నెస్‘ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిం చారు.

ఉచితాల మీద ఉన్నంత శ్రద్ధ ప్రభుత్వాలకు విద్యార్థుల మీద లేదని, విద్యార్థుల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాలు కూడా గాల్లోనే కలిసిపోతాయని అసోసియేషన్ ఫౌండర్ కురుమళ్ళ వంశీ ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్, యం.శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, శివరాం ప్రసాద్, యం. రాము, వై. వెంకటేష్, రజిని, బీసీ సంక్షేమ సంఘం నాయ కులు నీల వెంకటేష్ ముదిరాజ్ పగిళ్ల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.