calender_icon.png 13 October, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్డీయే కూటమికే కాస్తంత పట్టు

13-10-2025 01:24:21 AM

  1. ప్రభుత్వ ఏర్పాటుకు 40.2శాతం విజయావకాశాలు

‘మహా ఘట్బంధన్’కు 38.3 శాతం ఛాన్స్

రెండు కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్

సిథూ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశ రాజకీయాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 243 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏ పార్టీ భాగ స్వామ్యంతో ఏ కూటమి విజయ బావుటా ఎగురవేస్తుందనే చర్చ మొదలైంది. ఎన్టీయే కూటమిగా బీజేపీ, జేడీయూ కలిసి 2020 ఎన్నికల్లో పోటీ చేసినట్లుగానే సీట్ల పంపకాలు చేసుకుని బరిలోకి దిగుతున్నాయి.

అలాగే ఇండియా కూటమి (మహాఘట్ బంధన్), ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీ కూడా సై అంటే సై అంటూ గిరి గీస్తున్నా యి. వచ్చే నెలలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు ఇప్పటికే ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయ గా, ప్రస్తు తం నామినేషన్ల ప్రక్రియ సాగుతున్నది.

ఈ నేప థ్యంలో బిహార్ ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఎవరిని పెవిలియన్‌కు పంపించనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఇలాం టి సందర్భంలో ‘సీ -ఓటర్ సర్వే’ తాజాగా సంచలన విషయాలు వెల్లడించిం ది. సర్వే ప్రకారం ఎన్డీయే కూటమికే బీహార్ ఓటర్లు విజయం కట్టబెడతారని వెల్లడైంది. ఆ కూట



మికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40.2 శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే ఇండియా కూటమి (మహాఘట్బంధన్)కు 38.3 శాతం, జన్ సూర జ్ పార్టీకి 13.3 శాతం అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. 

ముఖ్యమంత్రిగా తేజస్వీ? 

ఒక వేళ ఎన్డీయే కూటమి అధికారం ఏర్పాటు చేస్తే నితీశ్‌కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగాలా? అనే ప్రశ్నకు 47.6 శాతం మంది.. నితీశే కొనసాగాలని కోరుకున్నారు. మరో 39.7 శాతం మంది ఆయన ముఖ్యమంత్రి కావొద్దని పేర్కొన్నారు. ఇక మిగిలిన వారు ఏమీ చెప్పలేమని సమాధానమిచ్చారు. పార్టీల పరంగా బలాబలాలు ఎలా ఉన్నా సీఎంగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు రావడం విశేషం. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ సీఎం కావాలని ఏకంగా 36.2 శాతం మంది మద్దతునిచ్చారు. 23.2 శాతం మంది ప్రశాంత్ కిశోర్, 15.9 శాతం మంది నితీశ్‌కుమార్ సీఎం కావాలని కోరుకున్నారు.


ఓటు శాతం తేడా 2 మాత్రమే.. 

ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి(మహాఘట్బంధన్)కి మధ్య ఓటింగ్‌శాతం 2 శాతం మాత్రమే ఉందని సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. దీంతో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ మొదలైంది. అలాగే ఎన్డీయే కూటమి పట్ల సంతృప్తికరంగా లేకపోతే ఎవరు పొత్తులను మార్చుకునే అవకాశం ఉందనే ప్రశ్నకు చిరాగ్ పాశ్వాన్ పొత్తు మార్చుకునే అవకాశం ఉందని 35.1 శాతం మంది సర్వేలో తెలిపారు. అలాగే జితన్ మాంఝీ 15 శాతం, ఉపేందర్ కుష్వా 5 శాతం, ముకేశ్ షైనీ 12.7 శాతం పొత్తు మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఎన్ని కల వేళ రాజకీయ గందరగోళం సృష్టించిన ‘ఎస్‌ఐఆర్’ ఎన్నికల్లో నిష్పక్షపాతాన్ని మెరుగు పరిచిందా..? అనే ప్రశ్నకు. పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని 42.6 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.