26-01-2026 03:02:22 AM
వేములవాడ, జనవరి 25,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ ప ట్టణంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా కన్ఫామ్ ఐఏఎస్ అధికారిగా నియామకమైన శ్యామ్ ప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా ఆదివా రం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర హస్తకళల కా ర్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ కూడా స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు,వేద పండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి స్వామివారి శేష వస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.