calender_icon.png 26 January, 2026 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి అడ్డుకట్ట పడుతుందనే వీబీజీ రాంజీ చట్టంపై కాంగ్రెస్ అక్కసు

26-01-2026 03:01:36 AM

బీజేపీ కిసాన్ మొర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య

రాజన్న సిరిసిల్ల, జనవరి 25(విజయ క్రాంతి):నూతన వి బి జి రాంజీ చట్టంతో కాంగ్రెస్ పాలకుల కమీషన్ల దందాకు కేంద్రం చెక్ పెట్టిందని.. అందుకే విబిజి రాంజీ చట్టంపై ఆ పార్టీ నేతలు విషం గక్కుతున్నారు‘ అని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనరసయ్య నిప్పులు చెరిగారు. సిరిసిల్లలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నూతన చట్టం పైనిర్వహించిన కార్యశాల కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు.

డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్తో కూలీల సొమ్ము నేరుగా ఖాతాల్లోకే చేరుతోందని మధ్యలో నొక్కేయడానికి వీల్లేకపోవడంతోనే కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ’దివాలాకోరు’ రాజకీయాలు చేస్తోందని, పనిదినాలను 125 రోజులకు పెంచడమే కాకుండా, పని కల్పించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన కూలీలకు వరప్రదయనిగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. 80% అదనపు బడ్జెట్తో గ్రామాల రూపురేఖలు మార్చేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని గ్రామాల్లో గిడ్డంగులు, రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణంతో గ్రామాలు వికసించడం కాంగ్రెస్కు ఇష్టం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

రఫేల్ నుంచి రామమందిరం వరకు. దేశానికి ఏ మంచి జరిగినా అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేడు ప్రజల దృష్టిలో’యాంటీ నేషనల్ కాంగ్రెస్’ గా ముద్ర పడిందని ధ్వజమెత్తారు.వ్యవసాయ పని దినాల్లో 60 రోజుల పాటు పనులకు విరామం కల్పించడం తో అటు కూలీలకు అదనంగా వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం కలగడం తో పాటు రైతులకు కూలీల లభ్యత పెరుగుతుందని ఆయన వివరించారు.పని ప్రదేశాల్లోనే విబిజి రాంజీ చట్టం గొప్పతనాన్ని కూలీలకు వివరించి,

కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, మండల జిల్లా కేంద్రాల్లో వివిధ వర్గాల ప్రజలతో సభలు సమావేశాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్, మట్ట వెంకటేశ్వర రెడ్డి,బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి పల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఉపాద్యక్షురా లు, లక్ష్మి అన్నాడి జలపతి రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.