02-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ముఠాగోపాల్
ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ధీమా వ్యక్తం చేశారు. త్వర లో జరగబోయే జిహెచ్‌ఎంసి కార్పొరేట్ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో బీఆర్‌ఎస్ పార్టీ విజ యం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు రాంనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లు ఎన్నికల్లో ముషీరా బాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్‌ల ను తామే కైవసం చేసుకుంటామని ఈసందర్భంగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు నాయకులు పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు దసరా, దీపావళి శుభాకాం క్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముఠా జై సింహ, రాంనగర్, ముషీరాబాద్ డివిజన్ల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, కొండా శ్రీధర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, సీనియర్ నాయకుడు సుధాకర్ గుప్తా, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఆర్. మోజెష్ తదితరులు పాల్గొన్నారు.
కనకాల కట్టమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని లోయర్ ట్యాంక్ బండ్‌లో గల శ్రీ కనకాల కట్ట మైస మ్మ ఆలయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ముఠా జై సింహలు బుధవారం దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
దసరా పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరు కున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, ఆలయ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ ఈవో సాంబశివరావు, ముకుంద రెడ్డి, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, మల్కిరెడ్డి సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.