02-10-2025 12:00:00 AM
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 1: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఉమేష్ ను నియామకం చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా ఉమేష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తనపై నమ్మకంతో జిల్లా స్థాయి పదవి అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ ప్రజాప్రతినిధులుగా ఎదిగే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు.