calender_icon.png 30 January, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజూ.. నామినేషన్ల జోరు

30-01-2026 01:36:03 AM

బీ ఫారం కోసం అభ్యర్థుల్లో తీవ్ర పోటీ... 

నేటితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ

ఆదిలాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కీలకమైన నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా తొలి రో జు నామమాత్రంగానే నామినేషన్‌లు దాఖలయ్యాయి. రెండవ రోజు గురువారం పెద్దఎ త్తున నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. సుమారు 150పైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం.  నామినేషన్ల కు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం అంతలోనే రెండు రోజు ముగిసిపోవడంతో ఆశా వాహ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

పోటీలో ఉండే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి తండోపతం డాలుగా తరలివచ్చారు. ఒక్కొక్కరు రెండేసి సెట్లు వేశారు. ఒక్కో వార్డు నుంచి దాదాపు ఐదుగురు కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా మారుతోంది. పార్టీల తరపున నామినేషన్లు వేసిన వారితో పాటు స్వతంత్రులు సైతం ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారీగా దాఖలు.. నేటితో ముగింపు 

రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో భారీ గా దాఖలయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచే ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి క్యూ కట్టారు. సాయం త్రం 5 గంటల వరకు కూడా ఒక్కొక్కరు వచ్చి దాఖలు చేయడం కనిపించారు. అటు మున్సిపల్ కార్యాలయంలోనూ ఇంటి పన్నుల బకా యిలు చెల్లించేందుకు అభ్యర్థులు భారీగా తర లి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు అనేక మంది స్వతంత్రులు దాఖ లు చేసే అవకాశం ఉంది. ఇది వరకు నామినేషన్లు వేసిన వారు సైతం చివరి రోజున మరో సెట్ వేసేందుకు వచ్చే అవకాశం ఉండటంతో భారీగా దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

బీ ఫారం కోసం ఆరాటం...

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు ఆయా ప్రధాన పార్టీల నుంచి టికెట్ల దక్కించుకుని బీ ఫారం కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ వంటి పార్టీల తరపున నామినేషన్లు దాఖలు చేసినప్పటికి బీ ఫారం ల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకున్నా బరిలో ఉండాలని భావిస్తున్న వారు నామినేషన్ ఫారాల్లో పార్టీ పేర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ఆయా పార్టీల కీలక నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా పార్టీ కార్యాలయం.. లేకుంటే నాయకుల ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నాయకుల నోటి మాటతో టికెట్లు కన్ఫామ్ అయిన వారు మాత్రం ధీమాగా ఉండగా.. టికెట్ హామీ దక్కని వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ దక్కని యెడల ఇతర గుర్తింపు కలిగిన పార్టీల నుంచి పోటీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే వివిధ కాలనీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు.. బరిలో ఉండాలని భావిస్తున్న వారు పార్టీల మారుతున్నారు. టికెట్ దక్కని వారు ఒకటి రెండు రోజుల్లో మరింత మంది పార్టీలు మారి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల సమయంలో కండువాలు మార్చడం సాధారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మున్సిపల్ ఎన్నికల వేల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంతున్నాయి. బీ ఫారాలు సమర్పించేందుకు ఫిబ్రవరి 3 వరకు సమయం ఉండటంతో ఎవరికీ దక్కుతాయోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.