30-01-2026 01:37:34 AM
నిర్మల్, జనవరి ౨౯ (విజయక్రాంతి): ఆడపిల్ల లు ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జాతీ య బాలికా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వాహిద్, డీఈఓ భోజన్న, డీఆర్డీఓ విజయలక్ష్మి, సీడీపీఓలు, ఉపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.