30-01-2026 12:59:51 AM
నాగర్ కర్నూల్ జిల్లాలో అమలు
కల్వకుర్తి డిసెంబర్ 29: యూరియా సరఫరాలో పారదర్శకత కోసం తెలంగాణ ప్ర భుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గురువారం నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులు తప్పనిసరిగా యాప్ ద్వా రా యూరియా బుక్ చేసుకుంటేనే కొనుగో లు చేసే విధానం అమలవుతోంది.కిసాన్ కపాస్ యాప్ తరహాలోనే యూరియా కొ నుగోలుకు ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశారు. అందులో ఏ పంటకు ఎంత యూరియా అవసరమో పొందపరిచారు.
ఆ పంటకు అ నుగుణంగా ఎంత అవసరమో ఒకేసారి కా కుండా దశలవారీగా యూరియా వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. యాప్ లో ఏ దు కాణంలో ఎరువులు ఉన్నాయో అన్ని లైసెన్సుడు దుకాణాల పేర్లు అందులో పొందప రచి ఉన్నాయి. తమకు అనుకూలమైన దు కాణం ఎంచుకోవడం అక్కడ లేకుంటే మరో దుకాణాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. యాప్లో బుకింగ్ చేసిన తరువాత యూరి యా అందుబాటులో ఉన్న కేంద్ర వివరాలు తెలుసుకుని అక్కడికి వెళ్లి పొందుతున్నారు.
ఆధార్ ఫోన్ నెంబర్‌కు అనుసంధానం ఉండాలి
యూరియా పొందేందుకు యూరియా యాప్ లో స్లాట్ చేసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉండాలి . యాప్ లోకి ఎంటర్ అయ్యాక ఫో న్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఓటిపి వస్తుంది. దా నిని ఎంట్రీ చేస్తే రైతు యొక్క భూమి వివరాలు వస్తాయి. వాటిలో ఏ పంట సాగు చేసారో సెలెక్ట్ చేసుకోవాలి .ఆ పంటకు అ నుగుణంగా మొత్తం ఎంత భూమికి ఎన్ని బ స్తాల యూరియా వస్తుందో కనిపిస్తుంది ప్ర స్తుతం ఎన్ని బస్తాలు వచ్చేందుకు వీలుంది ఎన్ని విడతల వస్తాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
వాటిని కన్ఫామ్ చేస్తే ఒక ఐడి నెం బర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారా దుకాణదారుల వద్దకు వెళ్తే ఆధార్ కార్డు ఎంట్రీ చే యంగానే మళ్లీ ఒక ఓటిపి వస్తుంది అప్పుడు రైతులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆం డ్రాయిడ్ ఫోన్ లేని రైతులకు ఇతరుల ఫోన్ ద్వారా పలువురికి బుకింగ్ చేసే వెసులుబాటు ఉండటంతో కొంత ఊరట లభిస్తోం ది. యాప్ వినియోగం సులభంగా ఉండటం తో రైతులకు ఇబ్బందులు లేవని వ్యవసాయ అధికారులు తెలిపారు.