calender_icon.png 30 December, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి

30-12-2025 01:28:45 AM

మాజీ సర్పంచుల అరెస్ట్ 

జహీరాబాద్, డిసెంబరు 28 : జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ స ర్పంచులు అసెంబ్లీ ముట్టడికి బ యలుదేరారు. జహీరాబాద్ ని యోజకవర్గంలో గతంలో ప్రజా ప్రతినిధులు చేపట్టిన పనుల బిల్లులు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు కొట్టుమిట్టాడుతున్నారు.

జహీరాబాద్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు తమ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేపట్టిన బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లుల గురించి తమను రెండు సంవత్సరాల కాలంలో పది సార్లు అక్రమ అరెస్టు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిడిగి మాజీ సర్పంచ్ కరణ్ రాజ్, రాయిపల్లి డి మాజీ సర్పంచ్ విజయ్ లను అరెస్టు చేశారు.