17-01-2026 01:05:46 AM
* క్యాలెండరును ఆవిష్కరించిన మండలాధికారులు
ధర్మపురి,జనవరి1౬ (విజయక్రాంతి): ప్రజల పత్రిక ‘విజయక్రాంతి‘ అంటూ వెల్గటూర్ మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి పాడి వెంకట్ ప్రసాద్ లు కొనియాడారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో ‘విజయక్రాంతి‘దినపత్రిక క్యా లెండరును శుక్రవారం వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు, బలహీన, పేద ప్రజల గొంతుకగా ‘విజయక్రాంతి‘ నిలబడుతుందన్నారు. నిజాలు నిర్భయంగా ప్ర చురిస్తూ, సమస్యల సాధనమార్గంలో అధికారులకు, ప్రజలకు మధ్య ‘విజయక్రాంతి‘ వారధిగా పనిచేస్తుందన్నారు.
విశ్లేషనాత్మక కథనాలు అందించడంలో ‘విజయక్రాంతి‘ తనదైనా మార్క్ చూపిస్తుందన్నారు. అతితక్కువ కాలంలో ప్రజల మన్ననలు చూరగొన్న ‘విజయక్రాంతి‘ మరింత వృద్ధిలోకి రావాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి ధర్మపురి నియోజకవర్గ ఆర్సీ కుశనపెల్లి రాజేందర్, రెవిన్యూ ఆర్‌ఐ రాంరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.