calender_icon.png 17 December, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్ డివిజన్‌లో తుది పోరుకు తరలి వెళ్లిన సిబ్బంది

17-12-2025 12:11:40 AM

భోజన ఏర్పాట్లపై సిబ్బంది ఆందోళన

నారాయణఖేడ్, డిసెంబర్ 16:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామ పంచాయతీ  ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో ఎన్నికల నిర్వహణ కోసం డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.డివిజన్ పరిధిలోని మొత్తం 196 గ్రామ పంచాయతీలకు గాను 483 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఇందులో 24 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 172 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లను సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు చేపడుతున్నామన్నారు.      

సిబ్బంది ఆందోళన...

స్థానిక ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బందికి సరైన భోజన వసతులు కల్పించలేదని వారు ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పస్తులు ఉన్నామని తమను అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో కాస్త అలజడి నెలకొంది.