calender_icon.png 25 December, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

25-12-2025 12:43:07 AM

కలెక్టర్ బి. ఎం. సంతోష్

గద్వాల, డిసెంబర్ 24 : బ్యాంకింగ్ లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించుకోవడానికి, తాము కృషి చేస్తున్న రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో క్లైమ్ చేయని ఆస్తులను సమర్ధవంతంగా మరియు త్వరగా పరిష్కరించడానికి ఉద్దేశించిన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుధవారం గద్వాల ఐడిఓసి మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పదేళ్లు, ఇంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా వివిధ బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్, తదితర కంపెనీల్లో ఖాతాదారులకు సంబంధించిన క్లైమ్ చేయబడకుండా ఉండిపోయిన డిపాజిట్లను తిరిగి పొందేందుకు, ఆయా ఖాతాలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి ఈ కార్యక్రమం సువర్ణ అవకాశంగా కలెక్టర్ పేర్కొన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు లక్షకు పైగా ఖాతాలకు చెందిన రూ.16.39 కోట్ల క్లైమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని, వీటిని తిరిగి చెల్లించేందుకు ఆర్.బి.ఐ అధికారులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఐ జనరల్ మేనేజర్ సుప్రభాత్, యుబిఐ జోనల్  హెడ్ అరవింద్ కుమార్, డీజీఎం సత్యనారాయణ, నాబార్డ్ డిడిఎం మనోహర్ రెడ్డి, ఎల్డిఎం శ్రీనివాసరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, భీమా రంగ సిబ్బంది పాల్గొన్నారు.