calender_icon.png 14 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాధా గోవిందుల రథయాత్ర

14-12-2025 12:00:00 AM

  1. కోకాపేటలో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహణ
  2. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాది మంది భక్తులు

హైదరాబాద్,- డిసెంబర్ 13 (విజయక్రాంతి): హరేకృష్ణ మూమెంట్, హైదరా బాద్ ఆధ్వర్యంలో శనివారం 4వ వార్షిక రాధా గోవిందుల రథయాత్ర కోకాపేటలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం తో జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొ ని భక్తి శ్రద్ధలతో, సంస్కృతి, సాంప్రదాయాలతో రథయాత్రను మహోత్సవంలా జరుపు కున్నారు. రథంపై సుందరంగా అలంకరించబడిన రాధా గోవిందుల విగ్రహాలు దివ్య రూపంలో విరాజిల్లగా, భక్తులు అపారమైన ఉత్సాహంతో రథాన్ని ముందుకు లాగారు.

రథయాత్ర మార్గంలో భక్తులు సంకీర్తనలు, భజనలతో మార్మోగించారు. ఈ క్రమంలోనే భక్తులకు ప్రసాదం పంపిణీ, ఆధ్యాత్మిక సేవలతో కోకాపేట ప్రాంతం అంతా శోభాయా మానంగా మారిపోయింది. శ్రీ కృష్ణ గోసేవ మండల గోశాలలో ప్రారంభమైన రథయాత్ర, గండిపేట మెయిన్ రోడ్ ‘వై’ జంక్షన్ నుంచి కోకాపేట ‘ఎక్స్’ రోడ్, అల్లు స్టూడియోస్, 7 హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ, రాజపు ష్ప ఆత్రియా, గోల్డెన్ మైల్ రోడ్ మీదుగా హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టు స్థలానికి చేరుకుంది.

500 మందికిపైగా భక్తులు రథా న్ని సమిష్టిగా లాగుతూ భక్తిని, ఐక్యతను ప్రదర్శించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక హాజరయ్యారు. సత్యగౌర చంద్రదాస ప్రభూ, అధ్యక్షులు  హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్, ప్రాంతీయ అధ్యక్షుడు అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

పిల్లల వేషధారణ నాటికలు, బేసిల్ ఉడ్స్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రంగు రంగుల రంగోలీలు, కోలాటం నృత్యాలతో రథయాత్ర మరింత ఆకర్షణీయంగా మారింది. దాదాపుగా 20,000 మందికిపైగా భక్తులకు దొన్న ప్రసాదం పంపిణీ చేశారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ స్థలంలో కార్యక్రమం ముగింపు సందర్భంగా గౌర చంద్ర దాస ప్రభూ ప్రవచనం, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు విందు ప్రసాదం అందించారు.