calender_icon.png 14 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ గెలిచిన గ్రామాలను అభివృద్ధి చేస్తా

14-12-2025 12:06:29 AM

  1. ఇతర పార్టీల సర్పంచ్‌లను 18లోపు వస్తే పార్టీలో చేర్చుకుంటాం
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్
  3. బీజేపీ నుంచి ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమావేశం    

కరీంనగర్, డిసెంబర్13(విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల సర్పంచ్‌లు అ సూయ పడేలా బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రా మాలను అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని, ఖర్చు చేస్తున్న నిధుల ను చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో ఎందుకు ఉన్నామా? అని ఆయా పార్టీల సర్పంచులు నామోషి అయ్యేలా చేస్తానని చెప్పారు.

గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో కేంద్ర మంత్రి బండి సంజయ్ శని వారం కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులను ఘ నంగా సన్మానించారు. రాష్ట్రంలో అధికారంలోకి లేనప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్య ర్థులకు గట్టి పోటీనిచ్చి గెలిచిన బీజేపీ సర్పంచులను ఈ సందర్భంగా బండి సంజయ్ ‘హీరో’లుగా అభివర్ణించారు.

ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్ తోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్ లు, ఉప సర్పంచులకు బీజేపీలోకి వస్తే ఆయా గ్రామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని చెప్పారు. అయితే ఈనెల 18లోపు మాత్రమే ఆయా పార్టీల సర్పంచులు బీజేపీలో చేరడానికి డెడ్ లైన్ విధిస్తున్నట్లు చెప్పారు.

అతి త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందన్నారు. రెండో, మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిని గోపి, నాయకులు చెన్నమనేని వికాస్ రావు తదితరులు పాల్గొన్నారు.