30-10-2025 12:55:31 AM
 
							హుస్నాబాద్, అక్టోబర్ 29:సిద్దిపేట జిల్లా జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతి కేసులో తమ ను అన్యాయంగా బలిపశువులను చేశారని ఆరుగురు పార్ట్ టైం టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురుకులాల సెక్రటరీ షో కాజ్ నోటీసులు, ఎస్సీ కమిషన్ ఆదేశాలతో హడావుడిగా చర్యలు తీసుకున్న జిల్లా ఉన్నతాధికారులు, అసలు బాధ్యులైన రెగ్యులర్ టీచర్లను, పర్యవేక్షణ లోపానికి ప్రధాన కారణమైన వారిని వదిలేసి కేవలం పార్ట్ టైం ఉపాధ్యాయులపైనే వేటు వేశారని వారు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్, డీసీవో ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగించబడిన ఆరుగురు పార్ట్ టైం టీచర్లు తమ ఆవేద నను వెల్లగక్కుతూ కీలక ఆరోపణలు చేశారు.
విద్యార్థి మృతి చెందిన రోజు, అంతకు ముం దు రోజు తాము క్లాసులకు హాజరు కాకపోవడానికి కారణం ప్రిన్సిపాల్ శ్యామలతేనని వారు అంటున్నారు. ఆమె తమకు ఇతర పరిపాలనా సంబంధిత పనులు అప్పగించడం వలనే ఆరోజు క్లాసులు చెప్పలేదని పార్ట్ టైం టీచర్ తిరుపతి తెలిపారు.
దసరా సెలవుల తర్వాత విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో క్లాసులు చెప్పకపోవడానికి ఒక కారణమన్నారు. ‘మేము రెగ్యులర్గా క్లాసులు చెప్తాము. కానీ ఆరోజు ప్రిన్సిపాల్ మేడమ్ వేరే పనులు చెప్పి తరగతి గదిలోకి వెళ్లకుండా చేసింది. మా మాటలు వినకుండా అన్యాయంగా, ఏకపక్షంగా మమ్మల్ని టర్మినేషన్ చేయడం ఎంతవరకు సమంజసం?‘ అని వారు ప్రశ్నిస్తున్నారు.
నిర్లక్ష్యం వెనుక రెగ్యులర్ ఉపాధ్యాయుల పాత్రపై మౌనం!
పార్ట్ టైం ఉపాధ్యాయుల వాదన ప్రకారం, ఈనెల 7న పాఠశాల సెకండ్ ఫ్లోర్ కారిడార్ లో ఉదయం నాలుగో పీరియడ్ స మయంలో వివేక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ పీరియడ్ లో పర్యవేక్షణ చేయాల్సిన రెగ్యులర్ టీచర్ పై ఎందుకు చ ర్యలు తీసుకోవడంలేదని పార్ట్ టైం టీచర్లు ప్రశ్నిస్తున్నారు. గురుకులంలో విద్యార్థుల పర్యవేక్షణ లోపానికి రెగ్యులర్ ఉపాధ్యాయు లు కూడా పూర్తి బాధ్యత వహించాలని,
ఉ న్నతాధికారుల దర్యాప్తు కేవలం పార్ట్ టైం సిబ్బంది మీదే దృష్టి సారించిందంటున్నా రు. వివేక్ మృతికి దారితీసినట్టు ప్రచారంలో ఉన్న అత్యంత సంచలనాత్మక ఆరోపణలపై దర్యాప్తు వేగం మందగించడం, ఇప్పుడు కేవలం పార్ట్ టైం టీచర్లను తొలగించడం వెనుక నిజమైన బాధ్యులను కాపాడే ప్రయ త్నం జరుగుతోందనే అనుమానాలకు మ రింత బలం చేకూరుస్తోంది.
న్యాయం కోసం పార్ట్ టైం టీచర్ల పోరాటం
తమపై జరిగిన ఈ అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, వాస్తవాలు వివరించడానికి ఆరుగురు పార్ట్ టైం ఉపాధ్యాయులు సి ద్ధమవుతున్నారు. తమ టర్మినేషన్ను వెనక్కి తీసుకొని, అసలైన కారణాలు, లోపాలను ప రిశోధించి, న్యాయం చేయాలని వారు జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించినా, తమ విధులు నిర్లక్ష్యం చేసిన రెగ్యులర్ సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా, తాము అకారణంగా బలికావడంపై పార్ట్ టైం ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్న ఆవేదన, ఈ కేసు దర్యాప్తులో మరో కొత్త మలుపును తీసుకొచ్చే అవకాశం ఉంది.