31-10-2025 01:51:15 PM
 
							జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్
హుజురాబాద్,(విజయక్రాంతి): అందరం సోదరభావంతో ముందుకు సాగి సమాజం, కుటుంబాలు ఎదిగేందుకు తమ వంతు కృషి చేయాలని హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్(Huzurabad Rural CI Puli Venkat) అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సమైక్య దినోత్సవంను పురస్కరించుకుని ఐక్యతకు ప్రతీకగా శుక్రవారం 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ పులి వెంకట్ 2kరన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత సన్మార్గాన్ని ఎంచుకొని సోదరభావంతో కలిసిమెలిసి ఉండి కుటుంబ ఆర్థికాభివృద్ధితో పాటు సమాజానికి సాంఘిక, సామాజిక సేవలు అందించాలని సూచించారు. చెడు మార్గాలను వదిలి మేల్కొని ముందుకు సాగి ఉన్నత చదువులు అభ్యసించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో కాచాపూర్ మాజీ సర్పంచ్ కొండ్ర రాజయ్య, కన్నాపూర్ మాజీ ఉపసర్పంచ్ ఆడితం కుమార్, హెడ్ కానిస్టేబుల్ కే. శ్రీనివాస్, పోలీసులు స్వామి, వంశీ, న్యాయవాది బొంగోని హరికృష్ణ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ దండు సమయ్య,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ షారుక్, బీసీ సంఘం మండలాధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్ విద్యార్థులు, యువత, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.