calender_icon.png 31 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి

31-10-2025 01:52:49 PM

వలిగొండ,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతిని(Indira Gandhi death anniversary ) వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఎన్నో సేవలను సంస్కరణలను అందించారని ఆమె ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తప్పక కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంకల కిష్టయ్య, బత్తిని సహదేవ్, బత్తిని లింగయ్య, కొండూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.