calender_icon.png 10 September, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి

10-09-2025 12:15:25 AM

  1. గేటు ముందు బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా 

పేద విద్యార్థులపై ప్రభుత్వానికి చిన్న చూపా

టిఆర్‌ఎస్ నాయకులు దుర్మార్గులా 

అసభ్యంగా ఉన్న బాత్రూంలో 

పట్టించుకోని ప్రిన్సిపాల్

అధికార పార్టీ నాయకులతో ప్రిన్సిపాల్ మంతనాలు

కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం బీఆర్‌ఎస్ డిమాండ్ 

గోపాలపేట సెప్టెంబర్ 9: తెలంగాణ రా ష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఏడు మంది విద్యార్థులను ఎలుకలు కరిచి గాయాలకు గురైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలంగా మారింది. విజయ క్రాంతి లో ‘ గురుకుల పాఠశాలలో ఘోరం ‘ వచ్చిన కథనానికి మంగళవారం బీ ఆర్ ఎస్ నాయకులు సాంఘిక సంక్షేమ పాఠశాల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.

జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మా ట్లాడుతూ గత ప్రభుత్వం వేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువులు ఆపె య్యకుండా వారు ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో కోట్ల రూపాయలు వె చ్చించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1000 గు రుకుల పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నా ణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.

కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వా టి పాలన పాలన చూసుకోవడంలో మరిచారన్నారు. నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్న ఏనాడైనా విద్యార్థుల గురుకుల పాఠశాలలను సందర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. బుద్ధారం సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు వి ద్యను అభ్యసిస్తున్నారు తప్ప మౌలిక వసతులకు మాత్రం దూరమయ్యారు.

ప్రతి వి ద్యా ర్థికి ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు చేసిన అందులోని వసతులు సక్రమం గా చూసుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గురుకుల పాఠశాల పరిసరాలు మౌలిక వసతులు సక్రమంగా చూసుకునే బాధ్యత ప్రిన్సి పాల్దే కదా అన్నారు. అలాంటి ప్రిన్సిపాల్ ఇంత నిర్లక్ష్యంగా ఉండటమేంటని ఆగ్రహించారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి గురుకు లాలలో ఇలా నిర్లక్ష్యంగా ఉండే ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బి ఆర్‌ఎస్ నాయకులను గేటు బ యటే ఉంచి అధికారంలో ఉన్న నాయకుల ను మాత్రం లోపలికి రమ్మని వారితో ప్రిన్సిపాల్ ఆరోగ్యం మంతనాలు జరపడంపై టి ఆర్‌ఎస్ నాయకులు మరింత మండి పడ్డా రు.

బీ ఆర్‌ఎస్ నాయకులు రెండు గంటలపాటు గేటు బయటే బైటాయించారు. లోప లికి రమ్మని అనుమతి ఇవ్వడంతో నాయకులంతా పాఠశాలను సందర్శించారు. విద్యా ర్థుల గదులు మూత్రశాలలో పరిశీలించారు. ఎక్కడ చూసినా గదలన్నీ అసభ్యంగా ఎలుకలు చనిపోయి దర్శనమిచ్చాయి. ఇక బా త్రూంలో అయితే కాలు పెట్టలేక అనంత పరిస్థితి నెలకొంది ఇంత అసభ్యంగా ఉంచు కోవడమేంటని ప్రిన్సిపాల్ ను జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ప్రశ్నించారు.

దీంతో ప్రి న్సిపాల్ ఆరోగ్యం దుర్మార్గులు నాశనమైతారని వారిని దూషించడంపై నాయకుల ఆగ్ర హించారు. ఈ పని శానిటేషన్ కాంట్రాక్టర్ చూసుకుంటారని ప్రిన్సిపాల్ సమాధానమిచ్చింది. పాఠశాలను అసభ్యంగా ఉంచకుం డా చూసుకునే బాధ్యత ప్రిన్సిపాల్ ది కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడో మారు మూల గ్రామాల నుం డి వస్తుంటే ఈ పాఠశాలను ప్రిన్సిపాల్ అ మ్మ ఒడిలా చూసుకునే బాధ్యత ఉంటుందని అన్నారు.

ఇలా నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సి పాల్ పై జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాల యం ముందు బీ ఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు తిరుపతి యాదవ్ గోపాలపేట మండలాధ్యక్షులు బాలరాజు, బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు హేమంత్ సూర్యవంశం గిరి ఇమ్రాన్ చంద్రశేఖర్ మథిన్ చిట్యాల రాము జోహెబ్ శ్రీను నాగరాజు కాశీనాథ్ జహంగీర్ లాలు వెంకటేష్ మహేందర్ శివ బిర్లా కంటి రాజు వెంకటయ్య హార్య నాయక్ కృ ష్ణారావు ఎండి గౌస్ లచ్చ గౌడు శేఖర్ ఓంకార్ తోళ్ల రవి లక్ష్మయ్య రాందాస్ రాజు వాకిటి తిరుపతి సురేష్ గోపాలరావు తదితరులు ఉన్నారు.