28-05-2025 12:21:17 AM
టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్
ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ల అమలును జూన్ 2 లోపు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(టీయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో హామీలు అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ విడుదల చేసి మాట్లాడారు.
గత 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, 6 గ్యారెంటీల హామీలలో హామీ పొందుపరిచారని గుర్తుచేశారు. ఆ ఎన్నికలలో తెలం గాణ ఉద్యమకారుల ఫోరం, ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమికను పోషించారని అన్నారు. సంక్షేమ పథకాలలో, ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాసం లలో 20 శాతం కోటా ఉద్యమకారులకు కేటాయించాలన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పా టు చేసి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కే టాయించాలని కోరారు. తెలంగాణ సాం స్కృతిక విభాగంలో వెయ్యి ఉద్యోగాలు కల్పించి తెలంగాణ ఉద్యమ కళాకారులకి కేటాయించాలని కోరారు.
ఈ సమావేశం లో ఫోరం ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు దయా నంద్, కొండ స్వామి, గగన్ కుమార్, వీరస్వామి, కొంతం యాదిరెడ్డి, జగన్ యాదవ్, సుదర్శన్ రావు, ఆర్.కే. భూపాల్, సుదర్శన్, శివ కుమార్ నేత, విష్ణువర్ధన్, శ్యామల, ప్రభు గుప్తా, రామ్ బాబు, నరేందర్ గౌడ్, చంద్ర శేఖర్, లక్ష్మణ్, గౌస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.