calender_icon.png 22 January, 2026 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలవేళ.. ముదిరిన ప్రొటోకాల్ రగడ

22-01-2026 01:19:13 AM

  1. అలంపూర్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్

సీసీ రోడ్డు శంకుస్థాపనకు టెంకాయ కొట్టే విషయంలో గొడవ 

ఎంపీ తీరుపై మండిపడుతున్న బీఆర్‌ఎస్ శ్రేణులు 

అదే కోవలో ఎమ్మెల్యే తీరుపట్ల మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు

అలంపూర్, జనవరి 21:రానున్న మున్సిపల్ ఎన్నికలవేళ అలంపూర్ రాజకీయాలలో సోమవారం జరిగిన ప్రోటోకాల్ వివాదం జిల్లా వ్యాప్తంగా దుమారం రేపుతుంది. భూమి పూజకు టెంకాయలు కొట్టే అంశంలో ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే విజయుడు ఒకరిని ఒకరు తోసేసుకున్నారు.

ఇరు పార్టీల చెందిన కార్యకర్తలు ఒకరినొకరు తోసేసుకుంటూ అరుపులు , ఈలలు వేయడంతో గొడవకు దారి తీసే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఎంపీ మల్లురవి ఇరు పార్టీల కార్యకర్తలను సద్దుమణిగించే తోపులాట జరిగింది. ఎంపీ మల్లురవి తీరు పట్ల బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.అదే కోవలోనే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ,ఎమ్మెల్యే విజయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 అసలు వివాదం ఎక్కడ మొదలైంది .....

ప్రభుత్వం వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులను మంజూరు చేసింది. అందులో భాగంగా మంగళవారం ఎంపీ మల్లు రవి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే విజయుడు సిసి రోడ్ల భూమి నిర్మాణం కు శంకుస్థాపన పనులకు సంబంధించి టెంకాయలు కొట్టే అంశంలో వివాదం తలెత్తింది. తమ నాయకుడు ముందు కొట్టాలని కాంగ్రెస్ లేదు మా ఎమ్మెల్యే ముందు కొట్టాలని టిఆర్‌ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.