22-01-2026 01:17:58 AM
గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ కేటగిరీల కింద ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ మొత్తం 16 మంది అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్ ) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి ఎంపిక చేసిన అధికారులను తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఎంపికైన అధికారుల జాబితా 2022కి చెందిన వారిలో డి మధుసూదన్ నాయక్, ఎం సత్యవాణి, జె భవానీ శంకర్, జి లింగయ్య నాయక్, ఎ నరసింహా రెడ్డి, జి వీరారెడ్డి, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, యు రఘురామ్ శర్మ, పి చంద్రయ్య, జి ముకుంద రెడ్డి, ఎ భాస్కర్ రావు ఉన్నారు. ఇక 2023కు సంబంధించి వైవీ గణేశ్, అబ్దుల్ హమీద్, బి వెంకటేశ్వర్లు ఉన్నారు. -2024లో ఎన్‌ఖీమ్యా నాయక్, కె.గంగాధర్ ఉన్నారు. అయితే ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది.