12-07-2025 12:35:36 AM
నిర్మల్, జూలై 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పుతుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే మండల రెవెన్యూ అధికారులతో పాటు ఆ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పారదర్శక పాలనకు అడ్డుకట్ట వేసి వేధింపుల పేరుతో అమాయక ప్రజలను ప్ర జాప్రతినిధులను ఇబ్బంది విమర్శలు వెలువస్తున్నాయి.
ప్రజాపాలన ప్రభుత్వంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే శాఖలో రెవిన్యూ శాఖ కీలకమైనప్పటికీ ఆ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు హిస్టరీగా వివరించడంతో ప్రజలకు పౌర సేవలు అందకుండా పోతున్నాయి ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా బైంసా ఖానాపూర్ నిర్మల్ డివిజన్‌లలో పని చేస్తే కొందరు అధికారులు శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైలు కదలాలంటే డబ్బులు ఇవ్వనిదే ఫైళ్లపై సంతకం పట్టడం లేదని జిల్లా ప్రజలు కోడైకుస్తున్నారు.
రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో ప్రజలకు పౌర సేవలు అందించడంలో కీలకమైనది కావడంతో కొందరు రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు సైతం లెక్కచేయకుండా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మీడియేటర్లను పెట్టుకొని ప్రతి పనికి ఒక రేటు అనే రీతిగా వివరిస్తున్నారని అభిప్రాయాలు జిల్లా లో వినిపిస్తున్నాయి.
వీరు ప్రతిరోజు మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజల అర్జీలను పరిష్కరించడం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం, భూ సమస్యలు పరిష్కరించడం, రేషన్ కార్డుల జారీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, లబ్ధిదారుల ఎంపిక, రెవెన్యూ అధికారుల పాత్ర కీలకం కావడంతో వారు ఆడింది ఆట పాడిందే పాట నడుస్తున్నట్టు ప్రజలు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం జిల్లా రెవిన్యూ అధికారి పోస్టు ఏడాదికాలంగా భర్తీ కాకపోవడంతో ఆర్డీవో రత్న కళ్యాణి ఇన్చార్జిగా నియమిస్తున్నారు. కొన్ని మండలాల్లో డీటీలను ఇన్చార్జి ఎమ్మార్వోలుగా నియమించగా మెజార్టీ మం డలంలో రెగ్యులర్ తసీల్దారులు, డీటీలు, ఆర్ ఐలు, జూనియర్ అసిస్టెంట్లు ఇతర సిబ్బంది ప్రజలకు జవాబు చెప్పే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రెవిన్యూ శాఖలో పెరుగుతున్న ఫిర్యాదులు
జిల్లాలోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొనడం ఫిర్యాదులకు దారితీస్తుంది. జిల్లాలోని సోన్ దిల్వార్పూర్ లోకేశ్వరం తాసిల్దార్ తాసిల్దార్ లో తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ వివిధ గ్రామాల ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు? ఈ తాసిల్దార్లు మాకు వద్దు అంటూ లోకేశ్వరంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందే ప్రజా ప్రతినిధులు మొరపెట్టుకొని చర్య తీసుకోవాలని వేడుకున్నారు.
ప్రజల అవసరాల కోసం ప్రజాప్రతినియులైన తా ము కార్యానికి వస్తే లోనికి రాకుండా ఆంక్షలు పెట్టడం తాము చెప్పిన పనులు కూడా చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇప్పటికి అనేక గ్రామాల్లో అరువుల పేర్లు గలత్తు కావడంతో కుబీర్ సారంగాపూర్ తానూర్ నర్సాపూర్ కడెం పెద్దుర్ ఖానాపూర్ తదితర మండలాల్లో లబ్ధిదారులు తమకు అన్యాయం జరిగిందని నిరసనలు కూడా తెలుపుతున్నారు.
సోను తహసిల్దార్ తీరుపై కడ్తాల్ గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆమె స్పందన లేకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు వరకు వెళ్లి ఫిర్యాదు చేయడం రెవెన్యూ శాఖలో అధికారుల పనితీరుకు నిదర్శనంగా జరుపుకుంటున్నారు. ఇటీవలే ప్రభుత్వం భూ భారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి భూ రికార్డులను క్రమబద్ధీకరణ మార్పులు చేర్పులకు అవకాశం కల్పించగా కొన్ని మండలాల్లో రెవె న్యూ అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కరిస్తామని పేర్కొంటూ మీడియేటర్ల ద్వారా సమస్యను బట్టి బీరసారాలు కుదుర్చుకుంటున్నట్టు ఆరోపణలు వెలువస్తున్నాయి.
భూ రిజిస్ట్రేషన్‌లో కొందరు అధికారులు అ త్యుత్సాహం ప్రదర్శించి వివాదాలు పరిష్కరించక పోగా వాటిని చూపిస్తు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. భూమి వివాదాలు కోర్టు పరిధిలో ఉన్న అం శంలో కూడా కొందరు జోక్యం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. జిల్లా వ్యా ప్తంగా కొందరు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్కు ఎప్పటికప్పుడు స్పందించి బదిలీలు చేపట్టడం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు పనిచేసే చోట తిరిగి అదే రీతిలో వివరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి?.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులు తీరుపై విమర్శలు ఫిర్యాదు లు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తేనే ప్రజలకు పౌర సేవలు అందుతాయి అన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇప్పటికే లోకేశ్వరం సోన్ దిల్వార్పూర్ తదితర మండలాల తహసీల్దారుల తీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఆన్లున్ పారదర్శక విధానాన్ని అమలు అమలు చేస్తున్నడంతో ప్రతివా రం ప్రగతి నివేదికలను తెప్పించుకొని ప్రజలకు తత్వరు న్యాయం జరిగినట్లు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యా ప్తంగా అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించిన కలెక్టర్ రెవిన్యూ శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టడంతో కొందరు తాసిల్దారులు ఇబ్బందులు పడుతున్నట్టు ప్ర చారం జరుగుతుంది.
ప్రభుత్వ పాలల్లో రెవిన్యూ శాఖ కీలక కావడంతో ఇప్పటికైనా ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచేలా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు