calender_icon.png 22 November, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలి

22-11-2025 12:04:42 AM

భారత ఎరుకల కులవృత్తుల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కండేల వెంకటేశ్వర్లు 

ఎల్బీనగర్, నవంబర్ 21 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ఎరుకల, గిరిజన, ఆదివాసీలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని భారత ఎరుకల కులవృత్తుల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కండేల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మన్సూరాబాద్ లో ఆయన మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ లోని సర్వే నెంబర్ 4, 5లో ఎరుకల, గిరిజన కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, వివిధ పనులు చేసుకుంటూ నిర్వహిస్తు న్నారని తెలిపారు.

ఆదివాసీ, ఎరుకులు, గిరిజనులకు వెంటనే ఖాళీగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కందు కూరు ఆర్డీవో, రంగారెడ్డి కలెక్టర్ కి వినతిపత్రులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో భారత ఎరుకల కులవృత్తుల అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి వనం గంగ య్య, నాయకులు కండెల మారయ్య, బిజిలి అశోక్, దాసరి గంగాధర్, కండెల వెంకన్న, పూజారి వెంకన్న, కుంభం సుంకయ్య, నిమ్మల నర్సింహ, కోనేటి అనురాధ, కోనేటి పద్మ, వజ్గిరి శాంత రాగా ఆనిత కోనేటి యాదమ్మ వజ్గిరి రోజా వనం శాంతి, రుద్రాక్ష పద్మ, మారయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.