calender_icon.png 6 December, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి

30-10-2024 01:22:57 AM

ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం గా మంగళవారం రాత్రి సిరిసిల్ల పట్టణంలో పోలీస్‌శాఖ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. అమరులను స్ఫూర్తిగా తీసుకుని పోలీసులు పని చేయాలన్నారు. అనంతరం పోలీస్ అధికారులతో కలిసి నేతన్న ఎస్పీ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.