26-01-2026 02:46:10 AM
మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్ అజాహరుద్దీన్
షాద్‌నగర్ జనవరి 25, (విజయక్రాంతి): జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి కి అన్నీ విధాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాను ఆయన సందర్శించుకున్నారు. పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ న్యాజ్ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఇక్కడ అభివృద్ధి గురించి అసెంబ్లీలో పలు సందర్భాల్లో తనకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకరన్న కోరుకున్న విధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, ఇప్పుడు కొత్తగా అభివృద్ధిని మొదలు పెడదామని మంత్రి అజహారుద్దీన్ అన్నారు.
భక్తులు ఎన్నో కోర్కెలతో బాబా వద్దకు వచ్చి ముక్కులు చెల్లించుకుంటానని వారందరికీ శుభం జరుగుతుందని తాను కూడా మొదటిసారి ఇక్కడికి రావడం జరిగిందని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే శంకరన్న కోరుకున్న విధంగా దర్గాను అభివృద్ధి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రిని పలువురు భక్తులతో పాటు స్థానికులు ఘనంగా సన్మానించారు.