26-01-2026 02:58:41 AM
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయ రమణారావు
మంథని, జనవరి 25(విజయ క్రాంతి) మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు పెద్దపల్లి నుండి ఆర్టీసీ సేవలు అందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి నుండి మేడారం జాతరకు భక్తుల ప్రయాణ, రవాణా సౌకర్యాలు మె రుగు పరిచేందుకు 175 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం జాతర బస్సు సేవలను ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల వాంఛ పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయించామని చెప్పారు.
డిపో పనులు శరవేగంగా సాగుతున్నాయని, అతి త్వరలోనే డిపో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎక్కువ బస్సులు డిపో వద్ద అందుబాటులో ఉంచామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని తెలిపారు. జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని ప్రకటించారు. పెద్దపల్లి నుండి జాతరకు బస్సులు నడుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు డిప్యూటి ఆర్ ఎం భూపతి రెడ్డి, డిపో మేనేజర్ కల్పన, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.