calender_icon.png 26 January, 2026 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

26-01-2026 01:09:57 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల అభ్యు న్నతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివా రం హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అ నంతరం మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ప్ర గతి సాధిస్తే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు ప్రాధాన్యమిస్తూ 200 మంది మైనార్టీ మహిళ లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మైనార్టీ అనుబంధ సం ఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.