18-09-2025 12:43:07 AM
కోదాడ సెప్టెంబర్ 17: లంబాడీల ఆత్మగౌరవ సభకు వేలాదిగా తరలి రావాలని లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్యా కోట్యా నాయక్ అన్నారు. ఈనెల 19న హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరు రావాలని కోరారు. అనంతరం బాలాజీ నగర్ కెఆర్‌ఆర్ కాలేజీ ఆవరణలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....లంబాడీల వేష,భాషలను,జీవన శైలిని మరియు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి లంబాడీల సోషల్ స్టేటస్ ను పరిగణలకు తీసుకుని ఆర్టికల్ 342 ప్రకారం 1976లో పార్లమెంట్లో అమలు చేయటం జరిగింది.. అప్పటికి 20 సంవత్సరాల రిజర్వేషన్ ని బంజారాలు కోల్పోయి ఉన్నారు.. ఆత్మగౌరవ సభ కు వేలాదిగా తరలి రావాలని కోరారు.ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలిగించడం సరికాదని అన్నారు.
బ్రిటీష్,నిజాం కాలంలోనే లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారని చరిత్ర స్పష్టం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బర్మావత్ రాజునాయక్ జిల్లా అధ్యక్షుడు భూక్య రవినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బానోతు నందలాల్ నాయక్, రాజు నాయక్ ,బానోతు సైదానాయక్ సేవాలాల్ సేన అజ్మీరా వాసునాయక్, కృష్ణ, నాగు, బాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.