18-09-2025 12:42:00 AM
భద్రాచలం, సెప్టెంబర్ 17, (విజయ క్రాంతి):గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టిఎల్‌ఎం మేళ, విద్యార్థిని వి ద్యార్థులతో నిర్వహించిన వివిధ రకాల కల్చరల్ పోటిలలో పాల్గొని గెలుపొందిన వారికి నగదు నగదు రూపంలో ప్రశంసా పత్రం, మెమొంటోలతో సత్కరించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అ న్నారు.
భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ నారాయ ణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో విద్యార్థినీ వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఒక నిమి షం వ్యాఖ్యానం, ఏకపాత్రాభినయం, కవితలు/పద్యాలు/ఉపన్యాసాలు, నాటక పోటీల లో దాదాపు 120 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారని,
అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థినీ విద్యార్థులకు మరియు జి ల్లాస్థాయి టిఎల్‌ఎం మేళాలో ఎంపికైన పా ఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులుఅందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలలో కానీ ఇటువంటి పోటీలలో గెలుపు ఓటములు అనేటివి సహజమని ఓటమి చెందినంత మాత్రాన నిరుత్సాహపడకుండా గెలుపు కోసం ప్రయత్నించాలని అన్నారు. విద్యార్థినీ విద్యార్థుల వివిధ కళారూపాల ప్రదర్శనలు మరియు నాటికలు చాలా బా గున్నాయని అన్నారు.
టిఎల్‌ఎం మేళలో డి విజన్ స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయిలో వి ద్యకు సంబంధించి ప్రదర్శించిన వివిధ కళాఖండాలు ఆకట్టుకున్నాయని, ఉపాధ్యా యు లు రూపొందించిన ఇటువంటి కళాఖండాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బో ధించాలని అన్నారు. డివిజన్ స్థాయిలో మరి యు జిల్లాస్థాయిలో బోధనకు సంబంధించిన వివిధ చిత్రాలను తయారుచేసిన ఎంపి క కాని ఉపాధ్యాయులు ఆ చిత్రాలతోనే వి ద్యార్థినీ విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా ఆచరణలో పెట్టాలని అన్నారు.
నిర్వహించిన పోటీలలో గెలుపొంది అవార్డులు తీసుకున్న విద్యార్థిని విద్యార్థులు వ్యా సరచన పోటీలలో ప్రణీత ఏ జి హెచ్ ఎస్ భద్రాచలం మొదటి బహుమతి రూ1000, సౌజన్య రెండవ బహుమతి రూ 500, ఏ జి హెచ్ ఎస్ కల్లూరు, ఒక నిమిషం స్పీచ్ మే ఘన గురుకులం కళాశాల భద్రాచలం మొద టి బహుమతి రూ 1000, ఇందు ఏ జి హెచ్ ఎస్ రామచంద్రుని పేట రెండవ బహుమతి రూ 750, సత్యానిక గురుకులం కళాశాల సుదిమల్ల మూడో బహుమతి రూ 500, డ్రామా నాటికలో మొదటి బహుమతి వర్షిత బిందు టి డబ్ల్యూ యు పి ఎస్ పృధ్విరాజ్ నగర్ మొదటి బహుమతి రూ 3000,
జశ్విత ఏ జి హెచ్ ఎస్ రేకుపల్లి రెండవ బహుమతి రూ 2000, ఏకపాత్రాభినయం సుచిత్ర ఏజిహెచ్‌ఎస్ రేగుబల్లి మొదటి బహుమతి రూ 1500, ఉపేంద్ర ఏ హెచ్ ఎస్ మల్కపోచారం రెండవ బహుమతి రూ1000, అశ్విత ఏ జి హెచ్ ఎస్ బూర్గంపాడు మూడో బహుమతి రూ 500, ఉపన్యాస పోటీలలో అవంతి ఏ జి హెచ్ ఎస్ కే రేగుబల్లి మొదటి బహుమతి రూ 1000, భార్గవి ఏ జి హెచ్ ఎస్ రెండవ బహుమతి రూ500,
టిఎల్‌ఎం మేళ తెలుగు సబ్జెక్ట్ అనసూయ మొదటి బహుమతి రూ 5000, అప్పుడప్పుడు భారతి రెండవ బహుమతి రూ3000, రాములు మూడవ బహుమతి రూ 2000, గణితం సబ్జెక్టుకు నాగరాజు, సుధీర్ కుమార్ మొదటి బహుమతి రూ 5000, పున్నారావు,రామకృష్ణ రెండో బహుమతి రూ 3000, భాస్కర్ రావు, కృష్ణకుమారి మూడో బహుమతి రూ 2000, ఇంగ్లీష్ సబ్జెక్ట్ భారతి మొదటి బహుమతి రూ 5000,
రమేష్ రెండవ బహుమతి రూ 3000, రఘునందన రావు మూడో బహుమతి రూ 2000 పారితోష్కాన్ని నగదు రూపంలో అందించి గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ ఓ భాస్కరన్, ఏసీఎంఓ రాములు, రమే ష్, ఏ టి డి వో లు అశోక్ కుమార్, రాధమ్మ, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.