calender_icon.png 27 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్‌ మనదే

27-12-2025 01:27:46 AM

వేదిక మారినా ఫలితం మారలేదు..  సొంతగడ్డపై భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతున్న వేళ మూడో టీట్వంటీ కూడా వన్ సైడ్ గానే ముగిసింది... ఫలితంగా మరో 2 మ్యాచ్ లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. లంక ఈ మ్యాచ్ లోనూ పెద్ద పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్ లో రేణుకాసింగ్, దీప్తి శర్మ, బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ మెరుపులు హైలైట్‌గా నిలిచాయి. 

  1. దంచికొట్టిన షెఫాలీ

భారత్ ఘనవిజయం

శ్రీలంకతో మూడో టీ20

తిరువనంతపురం, డిసెంబర్ 26: భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. ప్రపంచకప్ విజయం తర్వాత జరుగుతున్న తొలి సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. శ్రీలంకపై ఐదు టీట్వంటీల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

రేణుకా సింగ్, దీప్తి శర్మ జట్టులోకి తిరిగి రాగా.. అరుంధతి రెడ్డి, స్నేహ రాణాలకు విశ్రాంతినిచ్చారు. లంక ఓపెనర్లలో హాసిని పెరీరా దూకుడుగా ఆడినప్పటకీ.. మిగిలిన బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేసారు. ఫలితంగా శ్రీలంక పవర్ ప్లేలో నే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. చమరి ఆటపట్టు(3), సమరవిక్రమ (2), హాసిని పెరీరా (25) పరుగులకు వెనుదిరిగా రు.

సిల్వా(4) కూడా త్వరగానే ఔటవగా.. దులానీ (27), దిల్హరి (20) పరుగులతో ఆదుకు నే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తు లంకను తక్కువ స్కోరుకే పరిమి తం చేయడంలో విజయవంతమ య్యా రు. ఎక్కడా కూడా భారీ భాగస్వామ్యా లు నెలకొల్పే ఛాన్స్ ఇవ్వలేదు. రేణు కా సింగ్‌తో పాటు దీప్తి శర్మ లంక ఇన్నిం గ్స్‌ను దెబ్బకొట్టారు.

చివర్లో వికెట్ కీప ర్ కౌశానీ (19) ధాటిగా ఆడడంతో స్కోరు వంద పరుగులు దాటగలిగింది. పవర్ ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలోనూ భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. దీంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల కు 113 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకాసింగ్ 4, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్‌లో భారత్ 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా పూర్తి ఫామ్‌లోకిరాని స్మృతి మంధాన కేవలం 1 పరుగుకే వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి షెఫాలీ వర్మ ధాటిగా ఆడింది. జెమీమా ఆచితూచి ఆడినా షెఫాలీ మాత్రం లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడింది. జెమీమా తో కలిసి రెండో వికె ట్‌కు 40 పరుగులు జోడించారు.

జెమీమా(9) పరుగులకు ఔటైనప్పట కీ.. షెఫాలీ దూకు డు మాత్రం తగ్గలేదు. తనదైన శైలిలో రెచ్చి పోయిన షెఫాలీ వర్మ కేవ లం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అటు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ధాటిగా ఆడడంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ మెరు పు బ్యాటింగ్ తో భారత మహిళల జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. షెఫాలీ వర్మ 79 నాటౌట్ ( 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) , హర్మన్ ప్రీత్ కౌర్ 21 నాటౌట్ రాణించారు. ఈ విజయంతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుని 3-0 ఆధిక్యంలో నిలిచింది.

శ్రీలంక మహి ళల జట్టుపై భారత్ కు ఇది వరుసగా నాలుగో టీ20 సిరీస్ విజయం.  భారత బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రేణుకాసింగ్ (4/21) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డులకెక్కింది. ఈ క్రమంలో మెగా లానింగ్ (76) విజయాల రికార్డును అధిగమించింది. హర్మన్ ప్రీత్ సారథ్యంలో భారత్ 133 మ్యాచ్‌లకు గానూ 77 విజయాలు సాధించింది.నాలుగో మ్యాచ్ తిరువనంతపురంలోనే ఆదివారం జరుగుతుంది.

శ్రీలంక ఇన్నింగ్స్: 113/7 (దులానీ 27, హాసిని 25, దుల్హరి 20; రేణుకా సింగ్ 4/21, దీప్తిశర్మ 3/18), భారత్ ఇన్నింగ్స్:115/2 (13.2 ఓవర్లు) (షెఫాలీ వర్మ 79 నాటౌట్, హర్మన్ ప్రీత్ కౌర్ 21 నాటౌట్; దిల్హరి 2/18)