calender_icon.png 9 May, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కరే మనకు ఆదర్శం..

08-05-2025 12:15:47 AM

  1. వికారాబాద్‌లో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన స్పీకర్

పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎంపీ

వికారాబాద్, మే -7: దేశంలోని కోట్లాది మంది దళిత, గిరి జన, బహుజనులు తలేత్తుకుని బ్రతుకుతున్నారంటే ఆ దైర్యం పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని శాసనసభ సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎన్నెపల్లి కూడలీలో  చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య లతో కలిసి భారత రత్న, రాజ్యాంగ రూపకర్త డా క్టర్ బీంరావ్ అంబేద్కర్ 12 అడుగుల భారీ విగ్రహాన్ని శాస నసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సభాపతి గడ్డం ప్రసాద్ కు మార్ మాట్లాడుతూ....అంబేడ్కర్  ఒక చరిత్ర కాదు నేటి వా స్తవానికి ప్రతీక అన్నారు.విద్యా, ఉద్యోగాలుదళిత, గిరిజన, బ డుగు బలహీన వర్గాల ఆత్మబందువు భారతరత్న డాక్టర్ భీం రావు అంబెడ్కర్ అన్నారు.వికారాబాద్ పట్టణ ముఖద్వారం ఎన్నేపల్లి చౌరస్తాలో బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్ర హాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్ కు ఒక గౌరవం లభించిందని ఆయన పేర్కొన్నారు.

విద్యా, ఉద్యోగా లు, రాజకీయ, సామాజిక రంగాలలో తమ వాటాను పొందు తూ, ప్రజాప్రతినిధులు అవుతున్నామంటే అంటే దానికి కార ణం అంబేద్కర్ అని పేర్కొన్నారు.తాను పడిన కష్టాలు, తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడ దని అంబేడ్కర్  రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రాన్ని మనకు ఇచ్చా రని స్పీకర్ తెలిపారు.

అంబేడ్కర్ సన్మార్గాన్ని  చూపించారని,  అట్టి దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలను అందుకో వాలని స్పీకర్ సూచించారు.పూరి గుడిసెలో, దళిత వాడలలో, గిరిజన గూడేలలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పద వులు పొందుతున్నరంటే అంటే దానికి ఏకైక కారణం అంబే ద్కర్  అందించిన రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రం అన్నారు.నేను శాసనసభ స్పీకర్ అయింది అంటే అంబెడ్కర్ కల్పించిన రిజ ర్వేషన్ల బిక్షనే అన్నారు.

భూ ప్రపంచం ఉన్నంత వరకు అంబే డ్కర్ పేరు ఉంటుందని, ఈరోజు ఢిల్లీ నుండి గల్లీ వరకు పార్ల మెంట్ నుండి గ్రామ పంచాయతీ ల వరకు ప్రజాస్వామ్య పద్ద తిలో  పరిపాలన సజావుగా జరుగుతున్నది అంటే దానికి కార ణం అంబేద్కర్  రూపకల్పన చేసిన రాజ్యాంగమేనని ఆయన అన్నారు.

తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలం దళిత, గిరిజన, బహుజన వర్గాలకు ఏ లోటూ ఉండద ని,అంబేద్కర్  ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పరి పాలన సాగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియో జకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చే యడం జరుగుతుందని దీనితో పేద దళిత, గిరిజన, బీసీ వ ర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.

రా జ్యాంగం కింద మనం ఎలా స్వేచ్ఛగా బతుకున్నామో, బాబా సాహెబ్ అంబెడ్కర్  కల్పించిన రిజర్వేషన్లతో మనం ఎలా ల బ్ధి పొందుతున్నామో భవిష్యత్తు తరాలకు కూడా తెలియా ల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ తెలిపారు.

అంబేడ్కర్  ఈ దేశ దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఒక కాగడా లాగా వెలుగును పంచుతున్నారని,ఆ వెలుగులో మనం విజ యం అనే గమ్యాన్ని అందుకోవాలని అప్పుడే అంబేడ్కర్  నిజ మైన నివాళులర్పించిన వారమవుతామని స్పీకర్ పేర్కొన్నా రు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మా ట్లాడుతూ ... దేశానికి దిక్సూచి  చూపిన మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. 

అన్ని రంగాల్లో ప్రావి ణ్యం కలిగి ఉండడం వల్లనే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రచనకు ఆయన సేవలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... బాబా సాహెబ్ అంబేద్కర్ ను యువత స్ఫూర్తిగా తీసుకొని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచు కోవాలన్నారు. 

మహనీయుల విగ్రహాలను స్థాపించుకుంటు న్నామంటే వారి యొక్క త్యాగం, సేవలను ముందు తరాలు తెలుసుకునేందుకు అని ఆయన అన్నారు. ఉస్మానియా యూ నివర్శిటీ ఆరట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం మా ట్లాడుతూ... సమాజంలోని అసమానతలను రూపుమాపేందు కు  తన జీవితకాలం పోరాడిన మహా వ్యక్తి బాబాసాహెబ్ అం బేద్కర్ అన్నారు. 

అంబేద్కర్ వారసులుగా తమ జీవిత శైలిని మార్చుకుంటూ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్,  ఆర్థి క కమిటీ సభ్యులు రమేష్ మహారాజ్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టిఏ మెంబర్ జాఫర్, దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు, విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు, స్థానిక వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.