calender_icon.png 13 January, 2026 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల బ‘జోరు’..!

13-01-2026 12:23:32 AM

కరింనగర్, జనవరి12(విజయక్రాంతి): ధూమపాన అలవాటు మరింత ఖరీదైనదిగా మారబోతోంది. ఫిబ్రవరి 1 నుండి భారతదేశంలో సిగరెట్ల ధరలు 15 నుండి 40 శాతం పెరగనున్నాయి. ప్రభుత్వం పాత పరిహార నిబంధనలను తొలగించి, దాని స్థానంలో 40% జి ఎస్ టి మరియు కొత్త ఎక్సైజ్ సుం కాన్ని విదించాలని నిర్ణయించింది. ఈ ప్రకటనను ఆధారం చేసుకుని కరింనగర్ ఉమ్మ డి జిల్లాలో బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతోంది. ఎక్కువ వినియోగంలో ఉన్న గోల్ ఫ్లాక్ సిగరెట్ హోల్ సేల్ గా పాకెట్ ధర 156 రూపాయలు ఉండేది, విక్రయదారులు 180 రూపాయలకు అమ్మే వారు ప్ర స్తుతం 200 రూపాయలకు ఒక ప్యాకెట్ అ మ్ముతున్నారు. సిల్క్, కనెక్ట్ లు ఒక ప్యాకెట్ రిటైల్ లో 150 రూపాయలు ఉండగా ప్రసు తం 180 కి అమ్ముతున్నారు.

మార్కెట్ లో ఐ టి సి ఉత్పత్తులను అమ్మే ఏజెన్సీ వారు బ్లాక్ లో విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు అం దిన చర్యలు లేవు. పాన్ మసాలాలు ఇప్పటికే ఒక ప్యాకెట్ పై 20 శాతం పెంచి అమ్ముయున్నారు. సిగరెట్లు తాగేవారికి, పా న్ మసాలాలు వాడే వారికి కేంద్రం గట్టి షా కిచ్చింది. పొగాకు వాడకం తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిం దే. అయితే ఇదే అదనుగా కరీంనగర్ లో వ్యాపారుల బ్లాక్ మార్కెట్ కు ఎగబడి పొ గాకు ప్రియువుల బలహీనతను సొమ్ము చే సుకుంటూ ఫిబ్రవరి 1 వరకు కోట్లు కొట్టేసే దందాకు ఎగబడ్డారు. ఫిబ్రవరి లో ఒక్కో సిగరెట్ ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరగనుంది. అలాగే పాన్ మసాలాల ధరలు భారీగానే పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్నులు వర్తిస్తాయి.

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాల వాడకాన్ని ని యంత్రించే ప్రయత్నంలో భాగంగా వాటిపై పన్నులు పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ‘హానికారక వస్తువులు’ కోసం ఇటీ వల సవరించిన జీఎస్టీ రేటు కంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై అదనపు చార్జీలు విధిస్తారు. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం విధిస్తున్న పరిహార సెస్ స్థానంలో ఇవి వర్తిస్తాయి. సిగరెట్లపై 40 శాతం జీఎస్టీ తో పాటు అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తా రు. సిగరెట్ల ధరలో 53 శాతం పన్నుల రూ పంలో ప్రభుత్వానికి వెళ్తుంది.

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశం ప్రకారం 75 శాతం పన్నులు వేయాలి. ఇక పాన్ మసాలాలపై అదనపు ఎక్సైజ్ సుంకం స్థానంలో ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ విధిస్తారు. 40 శాతం జీఎస్టీ ఉంటుంది. నమిలే పొగాకు, జర్దా సువాసన గల పొగాకు, గుట్కా ప్యాకింగ్ యంత్రాల (సామర్థ్య నిర్ధారణ, సుంకం వ సూలు) నియమాలు-2026ను కేంద్ర ఆర్థిక శాఖ కూడా నోటిఫై చేసింది. కాగా సిగరెట్లతో పోలిస్తే బీడీలపై జీఎస్టీ రేటు తక్కువగా 18 శాతం ఉంటుంది. బీడీ పరిశ్రమలలో అందులోనూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతా ల్లో పనిచేసే కార్మికుల జీవనోపాధి కాపాడటానికి జీఎస్టీ రేటు తక్కువగా చేశారు. కేంద్ర నిర్ణయంను ప్రజలు హర్షిస్తున్నారు. వ్యాపారుల బ్లాక్ దందాకు బ్రేకులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.