31-10-2025 01:20:00 AM
 
							బోథ్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతులను అరెస్టు చేసినందుకు నిరసనగా గురువా రం చేపట్టిన సొనాల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే వ్యాపార వాణిజ్య సముదాయాలను యజమానులు మూసేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సొనాల లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ధర్నా చేయగా 13 మంది రైతులను అరెస్టు చేసిన విషయం విధితమే. దీనికి నిరసనగా బంద్ చేపట్టారు. కాగా ఈ బంద్ కు బీఆర్‌ఎస్ నాయకులు పూర్తి మద్దతు పలికి రైతులకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లా డుతూ... సోనాల బంద్ పిలుపు ఇవ్వగానే సంపూర్ణ బంద్ పాటించిన వ్యాపార యజమానులకు, ఆటో కార్మికులకు, కృతజ్ఞతలు తెలిపా రు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. బోథ్, సోనాల రైతులకు, యజమానులకు ఎటువంటి సమస్య వచ్చినా మీ వెంటే ఉంటామని ఎవరు అధర్య పడద్దని, ఈ బంద్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలన్నారు.
రైతులకు అండగా నిలిచిన బిఆర్‌ఎస్ నాయకులపై, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం హేమమైన చర్యని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై ప్రేమ ఉంటే సోనాల మండల కేంద్రంలో వెంటనే సోయా, మక్కల కొనుగోలు ప్రారంభించాలని, రైతులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతుల పాల్గొన్నారు.