calender_icon.png 27 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకు పాట.. ఉద్యమ బాట

27-10-2025 02:13:00 AM

భూస్వాముల వద్ద వెట్టిచాకిరీ, దొర గడీల వద్ద బానిసత్వం, అట్టడుగువర్గాలపై అడుగడుగునా వివక్ష, బీదల ఆకలిని చూసి, కన్నీళ్లుపెట్టుకుని, చలిం చి కవియై పురుడుపోసుకున్నాడు గూడ అంజయ్య (అంజన్న). చిన్నతనంలో అనుభవించిన పేదిరకం, చిన్న కమతాల రైతులు, వ్యవసాయ కూలీల వెతలు, వడ్డీ వ్యాపారుల దోపిడీని చూసి నూనుగు మీసాల ప్రాయంలోనే ‘ఊరిడిసి నేబోదునా.. ఉరిబోసుకుని సద్దునా..?’ అంటూ వలపోశాడు.

పాటంటే ఏంటో తెలియకముందే, పాటకుండే ప్రాథమిక లక్షణాలు అవగతం కాకముందే కవి అ వతారమెత్తాడు. తన పాటలతో, బాణీలతో ప్రత్యేతెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాడు. ప్రజల్లో స్వరాష్ట్ర ఉద్యమ కాంక్షను రగిలించాడు. ‘అయ్యోనివా నువ్వు.. అవ్వోనివా.. తెలంగాణోనికి తోటి పాలోనివా’ వల స పాలనను ప్రశ్నించాడు. ‘ఊరు మనదిరా..

వాడ మనదిరా’ పాటతో యావత్ దేశానికి శ్రామిక గీతం అందించాడు. ఆ పాట మొ త్తం 16 భాషల్లో అనువాదమై దేశమంతా ప్రతిధ్వనించిదంటే అంజన్న వాక్కుకున్న పదును ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అం దుకే ఆయన నిజమైన ప్రజా వాగ్గేయకారు డు. గూడ అంజయ్య ప్రస్తుత మంచిర్యాల జిల్లా (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో 1955 నవంబర్ 1న జన్మించాడు.

తల్లిదండ్రులు లక్ష్మ య్య, లక్ష్మమ్మ. అంజన్న పాఠశాల విద్య లిం గాపూర్, లక్సేట్టిపల్లిలో సాగింది. హైదరాబా ద్ వచ్చి ఇంటర్మీడియట్, బీఫార్మసీ పూర్తిచేశారు. తర్వాత ఉట్నూరు చేరుకుని ప్రభుత్వ వైద్యశాలలో ఫార్మసిస్ట్‌గా వృత్తి జీవితం ప్రా రంభించాడు. అప్పటికే పీపుల్స్‌వార్ ఉద్య మం మొదలైంది.

సమాజంలోని దురాచారాలు దోపిడీపై మహత్తర పోరాటం ప్రారం భమైంది. ఆ భావజాలానికి ఆకర్షితుడై తనలాగే జనం కోసం గళమెత్తే వారిని ఒక్కటి చే సి అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థా పించాడు. ప్రజానాట్య మండలి, తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకుడిగాకూడా పనిచేశారు. పలు చలన చిత్రాల్లో నటించాడు. 

‘ఊరిడిసి నేబోదునా’ పాట నేపథ్యం

అంజన్న ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఒకసారి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. బస్సు దిగి ఊరు వైపు న డుస్తుండగా ఆయనకు ఒక వృద్ధ రైతు ఎదురయ్యాడు. వృద్ధుడు దిగాలుగా ఉండటం చూసి, అంజన్న ‘ఎందుకు తాత గుబులైతున్నవు?’ అని అడిగాడు. అప్పుడా వృద్ధుడు ‘ఆరేండ్ల కింద నేను దొర దగ్గర అప్పు తీసుకున్నా.

అప్పటి దొర గడీల వెట్టి చాకిరీ చే స్తూనే ఉన్నా. అయినప్పటికీ దొర ఇంకా తన కు అసలు ముట్టలేదంటున్నడు. ఊరొదలిపోవాల్నో ఊరిలోనే చావాల్నో’ అని వలవ ల ఏడ్చుకుంటూ నిస్సహాయత వ్యక్తం చేశా డు. తనకు ఎదురైన ఈ అనుభవం అంజన్న హృదయాన్ని ద్రవింపజేసింది.

అలా అం జన్న నుంచి ఆశువుగా పుట్టిన పాటే.. ‘ఊరిడిసి నేబోదునా.. అయ్యో ఉరిబోసుకుని స ద్దునా..?’. పల్లెల్లో పుట్టి, పల్లెవాసుల కష్టాల ను స్వయంగా చూశాడు కాబట్టే, అంజన్నకు వారి కడగండ్లే పాట బాణీలయ్యాయి. 

తెలంగాణ ఉద్యమంలోనూ..

సాంస్కృతిక కళాకారులు, జానపద గా యకులు అంజన్న పాటలను విశ్వవ్యాపితం చేశారు. గద్దర్ వంటి వాగ్గేయకారుడికి కూ డా అంజన్న పాట ఒక దన్ను. ‘భద్రం కొడు కో.. కొడుకో కొమ్రన్న’ అని అంజన్న రాసిన పాట మొదట గద్దర్ గళం నుంచి వచ్చిందే. ‘కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటని చెవిని పెట్టక బయ ల్దేరిన బాటసారి కష్టం గురించి మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’లో రాయగా, అంజన్న పల్లె నుంచి పొట్టచేత బట్టుకొని నగరానికి వలస వచ్చే కుమారుడికి ‘భద్రం కొడుకా పైలం కొడుకా’ అని చెప్పే తల్లి మాటల్నే పాటగా కట్టాడు.

కేవలం ప్రజా సమస్యలపైనే కాదు.. తెలంగాణ పోరాటంలోనూ అంజన్న కీలక పాత్ర పోషించాడు. తొలి దశ ఉద్యమంలో అనేక ఆందోళనల్లో పాల్గొన్నాడు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అంజన్న నాటి ఉద్యమాల్లో భాగస్వామి అయ్యాడు. అందుకు తాను జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. అయినా ఆయన ఉద్యమ బాటను వీడలేదు. మలిదశ ఉద్యమంలోనూ పాలు పంచుకున్నాడు అంజన్న.

‘ధూంధాం’ పాటలతో ఉద్యమానికి ప్రాణం పోశాడు. రసమయి బాలకిషన్ తో కలిసి పోరాటానికి కొత్త శక్తినిచ్చాడు. దళితులపై కొనసాగుతున్న వివక్షపైనా పోరాటం చేశాడు అంజన్న. జనంనోట విన్న పదాలనే పాటలుగా రాసి బాణీలు కట్టాడు. మహాకవి శ్రీశ్రీతో అనేక స భల్లో పాల్గొన్నారు. అంజన్న ‘పొలిమేర’ అనే నవల వెలువరించాడు. ‘దళిత కథలు’ పేరిట ఒక కథా సంపుటిని ప్రచురించాడు. అంజన్న వాగ్గేయకారుడిగా ఎదుగుతున్న క్రమంలో సినీ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆయన్ను ఎంతో ప్రోత్సహించారు.

ఆయన ప్రోద్బలంతో నే అంజన్న హైదరాబాద్‌కు మకాం మార్చా డు. అంజన్న రాసిన పాటలను ఆర్.నారాయణమూర్తి ‘ఎర్రసైన్యం’, ‘స్వర్ణక్క’, ‘చీమలదండు’, ‘చీకటి సూర్యుడు’, ‘రైతురాజ్యం’, ‘దండోరా’ వంటి ఎన్నో చిత్రాల్లో వినియోగించారు. తద్వారా అంజన్న పాటలు మరింత ప్రాచూర్యం పొందాయి.

1970 నుంచి 1978 వరకు అంజన్న రచించిన, పాడిన పాటలను 1990 ప్రాంతంలో ఒక కవితల సంకలనంగా  విడుదల చేశాడు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా’ పుస్తకం విడుదలైంది. ఆయన దీర్ఘకాలం పక్షవాతం, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో సతమతమయ్యాడు. ఆరోగ్యం సహకరించకపోయినా ఓపికతో పాటలను రాస్తూ ఉన్న క్రమంలోనే..  2016 జూన్ 21న రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ రాగన్నగూడలోని స్వగృహంలో కన్నుమూశాడు. 

నవంబర్ ౧న గూడ అంజన్న జయంతి

తెలంగాణా గట్టు మీద సందమామయ్యో

ఓలా సందమామయ్య !

తల్లి మల్లి సెట్టుకేమో సందమామయ్యో

ఓలా సందమామయ్య !

ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో

ఓలా సందమామయ్య !

ఎర్ర మల్లెల పరిమళాలు 

సందమామయ్యో 

ఓలా సందమామయ్య ! 

వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో 

ఓలా సందమామయ్య !

భద్రం కొడుకో.. కొడుకో కొమ్రన్న జర

పైలం కొడుకో.. కొడుకో కొమ్రన్న జర

రిక్షా ఎక్కే కాడ దిగే కాడ..

తొక్కుడు కాడ మలుపుడు కాడ.. 

భద్రం కొడుకో.. జర పైలం కొడుకో..

అయ్యోనివా నువు అవ్వోనివా

తెలంగాణోనికే తోటి పాలోనివా’

ఇసుంట రమ్మంటే ఇళ్లంతా మీదంటరా?

అరె.. తిన్నింటి వాసాలె లెక్కిస్తరా?

అరె.. తిన్నింటి వాసాలె లెక్కిస్తరా?

పుడితొక్కటి.. సస్తె రెండు.. 

రాజిగ.. ఒరి రాజిగో

ఇగ ఎత్తుర తెలంగాణ జెండా.. 

రాజిగ ఒరి రాజిగ..

సేను వాయె సెలక వాయె.. గజ్జెలో రాజన్న

బతుకు వాయె మెతుకు వాయె.. 

గజ్జెలో రాజన్న

మోతుకు మూడాకులాయె.. గజ్జెలో రాజన్న

గొడ్డు వాయె గోద వాయె.. గజ్జెలో రాజన్న

వలసవోయి బతుకుడాయె.. గజ్జెలో రాజన్న

ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా !

పల్లె మనదిరా.. ప్రతి పనికి మనమురా!

సుత్తె మనది.. కత్తి మనది..

పలుగు మనది.. పార మనది..

బండి మనదిరా.. బండెడ్లు మనవిరా !

ఊరిడిసి నేబోదునా..

అయ్యో.. ఉరిబోసుకుని సద్దునా..

అసలేటి వానల్లో.. ముసలెడ్ల గట్టుకొని

మోకాలి బురదలో.. మడిగట్టు దున్నితే

గరిసెలెవరివి నిండెరో- గంగన్న !

గుమ్ములెవరివి నిండెరో- గంగన్న!